Penugonda: బతుకుదెరువు కోసం వెళ్ళి.. మస్కట్‌లో ఇలపర్రు వాసి దుర్మరణం
Penugonda: జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన సరిళ్ల విజయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Penugonda: బతుకుదెరువు కోసం వెళ్ళి.. మస్కట్‌లో ఇలపర్రు వాసి దుర్మరణం
Penugonda: ఇలపర్రు ఇల్లు కట్టుకోవాలని.. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని.. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని బతుకు జీవుడా అంటూ స్వదేశం వదిలి విదేశాలకు జీవనోపాధి నిమిత్తం వెళ్లేవారు ఎందరో.. చేసిన అప్పులు తీర్చి వీసా పూర్తి చేసుకుని వచ్చేవారు కొందరే.. కంటినిండా నిద్ర లేక.. సరైన తిండి లేక అనారోగ్యాలకు గురయ్యే వారు మరికొందరు. ప్రమాదాలకు గురై దుర్మరణం పాలై ఆర్థికంగా చిన్న భిన్నం అవుతున్న కుటుంబాలు లేకపోలేదు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలుపూరు గ్రామానికి చెందిన సరిళ్ల విజయ్ కుమార్ జీవనోపాధి నిమిత్తం ఆరు నెలల క్రితం మస్కట్ (గల్ఫ్) దేశం వెళ్లారు. అక్కడి ప్రైవేట్ కంపెనీలో వీసా పొంది అప్పు చేసుకుని విదేశం వెళ్లాడు. ఈ క్రమంలో జూన్ 30న తన కంపెనీ జీతం తీసుకుని స్వదేశంలో ఉన్న కుటుంబానికి నగదును పంపించేందుకు సంబంధిత కార్యాలయానికి వెళ్తుండగా వాహనం ఢీకొని తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో జూన్ 1 నుండి 9 వరకు అక్కడి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృత్యువుతో పోరాడి చివరకు ఈ నెల 9న తుది శ్వాస విడిచారు.
విజయ్ కుమార్ భౌతికకాయాన్ని సోమవారం మస్కట్ నుండి స్వదేశానికి పంపేక్రమంలో మృతదేహం హైదరాబాదు విమానాశ్రయానికి మంగళవారం చేరుకుంటుందని అక్కడ నుండి బుధవారం మధ్యాహ్నానికి స్వగ్రామం ఇలపర్రుకు వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయ్ కుమార్ కు భార్య బేబీ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహమైంది.
ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేందుకే విజయ్ కుమార్ గల్ఫ్ దేశం వెళ్లాడు. ప్రమాద వార్త, కాలక్రమేన మరణ వార్తతో ఇలపర్రు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు విజయ్ కుమార్ మృతితో భార్య, కుమార్తెలకు దిక్కు ఎవరని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. గ్రామంలో విజయ్ కుమార్ మరణ వార్తతో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ప్రభుత్వమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.




