Narasapuram: కొప్పర్రు సర్పంచ్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఘన విజయం!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థి కడలి ఉషాకుమారి 594 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
Narasapuram: కొప్పర్రు సర్పంచ్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఘన విజయం!
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన కూటమి పార్టీ అభ్యర్థి శ్రీమతి కడలి ఉషాకుమారి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 594 ఓట్ల భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు.తన గెలుపుకు కారనమైన కొప్పర్రు ప్రజానీకానికి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
అదేవిదంగా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, పోలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య నాయకులు అందరికీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొప్పర్రు జనసేన పార్టీ సాధించిన సాధించిన ఈ విజయం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది కొప్పర్రు పంచాయతీలో జనసేన అభ్యర్థి సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు, మద్దతుదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
విజయం అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు,ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా కొప్పర్రు సర్పంచ్ శ్రీమతి కడలి ఉషాకుమారి, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి పోలిశెట్టి నాగవేణి, వార్డు మెంబర్లు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.




