Narsapuram: నర్సాపురంలో ఒక్కటైన లండన్ అమ్మాయి, ఇండియన్ అబ్బాయి!

Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో లండన్ యువతిని హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్న స్థానిక యువకుడు; విదేశీ వధువు పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 28 Aug 2026 8:49 AM IST
Narsapuram
X

Narsapuram: నర్సాపురంలో ఒక్కటైన లండన్ అమ్మాయి, ఇండియన్ అబ్బాయి!

Narsapuram: దేశాలు వేరైనా.. భాషలు వేరైనా.. మనసులు కలిస్తే ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవని నర్సాపురం అబ్బాయి, లండన్ అమ్మాయి నిరూపించారు. ఉద్యోగరీత్యా లండన్‌లో పరిచయమైన వీరిద్దరి ప్రేమ.. హిందూ సంప్రదాయ వివాహ బంధంగా మారింది.

ఇరు కుటుంబాల అంగీకారంతో నర్సాపురంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. నర్సాపురానికి చెందిన బొర్రా శివ సుబ్రహ్మణ్యం ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి, అక్కడ ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అదే సంస్థలో పనిచేస్తున్న బిపాసాతో ఆయనకు పరిచయం ఏర్పడింది.

పరిచయం కాస్త స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారి.. చివరకు పెళ్లి బంధానికి దారితీసింది. బిపాసా కుటుంబ మూలాలు గుజరాత్‌కు చెందినవి. మూడు తరాల క్రితం ఆమె కుటుంబం వ్యాపారరీత్యా లండన్‌లో స్థిరపడింది.

అక్కడే పుట్టి పెరిగిన బిపాసాకు శివ సుబ్రహ్మణ్యం భారతీయుడు, అందులోనూ తెలుగువాడు కావడంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది. ఇండియన్ అబ్బాయి.. లండన్ అమ్మాయి అయినప్పటికీ, వీరి వివాహం మాత్రం పూర్తిగా హిందూ సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది.

హిందూ వివాహంలోని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు అద్దం పట్టేలా కుటుంబ సభ్యులు వివాహ వేడుకను నిర్వహించారు. దేశాలు దాటిన ప్రేమకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆశీస్సులు తోడవడంతో నర్సాపురంలో జరిగిన ఈ వివాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM

Next Story