West Godavari: ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ - జిల్లా జడ్జ్ శ్రీదేవి
West Godavari: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జ్ ఎస్. శ్రీదేవి పిలుపు.
West Godavari: ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ - జిల్లా జడ్జ్ శ్రీదేవి
పశ్చిమ గోదావరి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్ట్ లలోను ఈనెల 12 వ తేదీ రెండవ శనివారం ఉదయం 11 గంటల నుండి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా జడ్జ్ ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలూరు జిల్లా కోర్ట్ ఆవరణలోని జిల్లా న్యాయ సేవ సదన్ భవనంలో ఈనెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కావున కక్షీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీ మార్గం ద్వారా పరిష్కారానికి అర్హత కలిగిన కేసులు పరిష్కరించుకోవలసిందిగా శ్రీదేవి తెలియజేసారు.




