Penugonda: పెద్దల దీవెనలతో ప్రచారంలో మార్న గాయత్రి!
Penugonda: పెనుగొండ ఎంపీటీసీ-4 కూటమి అభ్యర్థిని మార్న గాయత్రీ నాగమణికేశ్వరి పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.
Penugonda: పెద్దల దీవెనలతో ప్రచారంలో మార్న గాయత్రి!
పెనుగొండ: పెనుగొండ మండలం ఎంపీటీసీ–4 కూటమి అభ్యర్థిని మార్న గాయత్రీ నాగమణికేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దలను మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థినిగా ఎన్నికల బరిలో ఉన్న మార్న గాయత్రీ నాగమణికేశ్వరి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పెద్దలను కలిసి వారి దీవెనలు తీసుకుంటూ, తనను ఆశీర్వదించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




