Penumantra: ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎంకు ఓటేయండి: జిల్లా కార్యదర్శి!

Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలం ప్రారంభించి అభ్యర్థులకు మద్దతు కోరారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 25 Oct 2026 11:50 PM IST
Penumantra
X

Penumantra: ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎంకు ఓటేయండి: జిల్లా కార్యదర్శి!

పెనుమంట్రలో: ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేస్తున్న సిపిఎం అభ్యర్థులు పెనుమంట్ర జడ్పిటిసి స్థానానికి కెతా గోపాలం, పెనుమంట్ర ఎంపీటీసీ2 స్థానానికి కోడి లక్ష్మి పోటీ చేస్తున్నారని వారి ఇరువురికి ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్వి గోపాలం కోరారు.

ఆదివారం పెనుమంట్రలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లు అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసగిస్తుందని అన్నారు.

50 ఏళ్లకే పేన్షన్, నిరుద్యోగ భృతి కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతూ ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకుంటుందని అన్నారు. పెనుమంట్ర మండలంలో ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ పనులు, దళితుల స్మశానాలు, కౌలు రైతులు, రైతుల సమస్యలపై అనేక పోరాటాలు చేసి సిపిఎం ప్రజలకు అందుబాటులో ఉందని అన్నారు.

మండలంలో ప్రజలను సమీకరించి వారు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. స్థానిక సంస్థలలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థి కేతగోపాలం, ఎంపీటీసీ అభ్యర్థి కోడి లక్ష్మి తో పాటు సిపిఎం జిల్లా నాయకులు పివి ప్రతాప్, జక్కం శెట్టి సత్యనారాయణ, కేతా పద్మ, కోడి శ్రీనివాస ప్రసాద్, ఆకుల హరే రామ్, కుసంపూడి సుబ్బరాజు, ఎం ఆంజనేయులు, బత్తుల విజయ్ కుమార్, రాపాక ఆశీర్వాదం, పిల్లి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA