Penumantra: పెనుమంట్ర జడ్పీటీసీ ఎన్నికపై ఉత్కంఠ: 7న తేలనున్న తీర్పు!

Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. నవంబర్ 7న ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది.

E.ABRAHAM, ACHANTA
Published on: 5 Nov 2026 9:12 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్ర జడ్పీటీసీ ఎన్నికపై ఉత్కంఠ: 7న తేలనున్న తీర్పు!

పెనుమంట్ర: ఆచంట నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత హోరాహోరీగా సాగిన ఎన్నిక పెనుమంట్ర జెడ్పీటీసీ ఎన్నికే. పోలింగ్ ముగిసినా, మండలంలో ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠతో రెండు పార్టీల కార్యకర్తలు 7వ తేదీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

ఇద్దరూ సీనియర్లే... ఇద్దరూ బలమైనవారే..!

ఈసారి పోటీలో ఉన్నది సాధారణ అభ్యర్థులు కాదు. ఇద్దరూ రాజకీయంలో ఆరితేరిన అనుభవజ్ఞులే.

వైసీపీ నుంచి - కర్రీ వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి):

గ్రామాల్లో మంచి పట్టు, కార్యకర్తల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసిన వాసురెడ్డి ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకుని, "ప్రజలే నా బలం, అభివృద్ధే నా నినాదం" అని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ నుంచి - వెలగల బులిరామిరెడ్డి:

దశాబ్దాల రాజకీయ అనుభవం, మండల వ్యాప్తంగా పరిచయాలు ఉన్న సీనియర్ నేత. దంపతులతో కలిసి ఓటు వేసిన బులిరామిరెడ్డి, "ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, సైకిల్ గెలుపు ఖాయం" అని ధీమా వ్యక్తం చేశారు.

ఎందుకు అంత గట్టి పోటీ?

పెనుమంట్ర మండలం ఎప్పుడూ రాజకీయంగా సెన్సిటివ్. ఇక్కడ ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ లో ఇరు పార్టీలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈసారి మురసు తుఫాను, వరద, పంట నష్టం, జగనన్న కాలనీలో నీటి సమస్యలు కూడా ఎన్నికలపై ప్రభావం చూపించాయి. ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఇక కౌంటింగ్ రోజే తేల్చాలి..

ఎన్నిక ముగిసింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజా తీర్పు కోసం ఎదురుచూపు. ఇరు పార్టీల నాయకులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా, లోలోపల టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. నవంబర్ 7వ తేదీ - పెనుమంట్ర ప్రజా తీర్పు లో ఎవరు విజేతలు తేల నుంది.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA