Tanuku: విద్యార్థులకు పోక్సో, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన!

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఒకటో నంబర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. స్వర్ణ విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 18 Nov 2026 5:59 PM IST
Tanuku
X

Tanuku: విద్యార్థులకు పోక్సో, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన!

తణుకు: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. స్వర్ణ అన్నారు.రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశాల మేరకు బుధవారం తణుకు ఒకటో నెంబర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బాలల హక్కులు, సామాజిక సమస్యలపై ఆమె అవగాహన నడిపించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పోక్సో చట్టం-2012, ఆ చట్టం కింద విధించే శిక్షలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సెల్‌ఫోన్ల అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై వివరించారు.విద్యార్థులు ప్రతి విషయాన్ని మంచిదా, చెడ్డదా అని విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

చిన్న వయస్సులో ప్రేమ, ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. సెల్‌ఫోన్లను అవసరమైన మేరకే వినియోగించాలని, వాటి ద్వారా ఎదురయ్యే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ప్రతి విద్యార్థి తమకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలోన్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ఇసెట్టి బేబీ, డాక్టర్ఎన్.కృష్ణారెడ్డి,ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఎస్. సత్యనారాయణ, పారా లీగల్ వాలంటీర్లు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)