Tanuku: మున్సిపల్ చైర్మన్‌గా అవకాశమిస్తే తణుకును అభివృద్ధి చేసి చూపిస్తా!
Tanuku: మున్సిపల్ చైర్మన్‌గా ఒక్కసారి అవకాశమిస్తే తణుకు పట్టణాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి సుందరవనంగా తీర్చిదిద్దుతానని టీడీపీ అభ్యర్థి బసవ రామకృష్ణ అన్నారు.
Tanuku: మున్సిపల్ చైర్మన్‌గా అవకాశమిస్తే తణుకును అభివృద్ధి చేసి చూపిస్తా!
తణుకు: ఒక్కసారి అవకాశం కలిపిస్తే తణుకు పట్టణాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి సుందరవనంగా తీర్చిదిద్దుతానని తణుకు మున్సిపల్ చైర్మన్ తెదేపా అభ్యర్థి బసవ వీర వెంకట సత్యరామకృష్ణ (రామకృష్ణ) అన్నారు. హెచ్ఎంటీవీ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్ర అధిష్టానం తనకు చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సారధ్యంలో రెండున్నరేళ్ల కాలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి పలు సమస్యలకు పరిష్కారం చూపించారని తెలిపారు. గత పాలనలో రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవంతో పట్టణ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
తణుకు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని వీటిలో ప్రధానంగా మురికివాడల్లో డ్రైనేజీ, రహదారుల వ్యవస్థ మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించి వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థిగా తనకు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పుర ప్రజలను కోరారు.




