Tanuku: అదుపు తప్పి పంట బోదేలోకి దూసుకెళ్లిన ఆటో.. 16 మంది విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం కొమరవరం వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. స్థానికుల అప్రమత్తతతో 16 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
Tanuku: అదుపు తప్పి పంట బోదేలోకి దూసుకెళ్లిన ఆటో.. 16 మంది విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..!
తణుకు: విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి పంట బోదే లోకి దూసుకెళ్లిన సంఘటనలో 16 మంది విద్యార్థులు స్థానికుల సహకారంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు, అధికారుల కథనం మేరకు.. పాఠశాల విడిచిన అనంతరం తణుకు రూట్స్ పాఠశాల నుంచి 16 మంది విద్యార్థులతో ఆటో వారిని ఇళ్లకు తరలించేందుకు తణుకు మండలం మహాలక్ష్మి చెరువు, యర్రాయి చెరువు గ్రామాలకు బయలుదేరింది.
మార్గం మధ్యలో కొమరవరం ఒనేలమ్మ వంతెన వద్ద శనివారం ఆటో అదుపు తప్పి పంట బోదేలోకి దూసుకెళ్లింది. సంఘటన జరిగిన సమయంలో స్థానికులు, రైతులు ఆ ప్రదేశంలో ఉండటంతో పంట బోదేలోకి పల్టీలు కొట్టిన ఆటోలో చిక్కుకుపోయిన చిన్నారులను సురక్షితంగా రక్షించారు. వీరిలో ఆరో తరగతి విద్యార్థి కే.శ్రీధర్ అస్వస్థకు గురవడంతో 108 వాహనంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి అపాయం లేదని పాఠశాల డైరెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఆటో ప్రయాణిస్తున్న సమయంలో మార్గ మధ్యలో శునకం అడ్డు రావడంతో ప్రమాదం వాటిల్లిందని వెల్లడించారు.




