Eluru: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి!

Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడులో విషాదం. ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుతో కూలీ మృతి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 16 Jun 2026 11:55 AM IST
Eluru
X

Eluru: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి!

ఏలూరు జిల్లా: వేలేరు పాడు మండలంలోని జిన్నాలగూడెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఎస్) పనులు జరుగుతున్న ప్రదేశంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పని చేస్తుండగానే గుండెపోటుకు గురైన కూలీ అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన తురసం పెద జోగయ్య (65) మంగళవారం ఉదయం ఇతర కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు.

ఎప్పటిలాగే ఉత్సాహంగా పనులు చేస్తున్న ఆమెకు అకస్మాత్తుగా కుప్పకూలి పోయాడు.ఇది గమనించిన తోటి కూలీలు వెంటనే ఆయన ను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించగా స్పందించలేదు. స్థానికులు, తోటి కార్మికులు కలిసి ప్రాథమిక సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

గుండెపోటుతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పని ప్రదేశంలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితం వరకు తమతో కలిసి పనిచేసిన పెద జోగయ్య ఒక్కసారిగా మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు.

కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించడంతో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.సమాచారం అందుకున్న కోదాడ ఎంపీడీవో శ్రీహరి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పెద జోగయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఆయన, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం తరఫున అందే సహాయం పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.పేద కుటుంబానికి చెందిన పెద జోగయ్య ఉపాధి హామీ పనుల ద్వారానే జీవనోపాధి పొందుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, ప్రత్యేక పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story