Achanta: పోడూరు ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం!
Achanta: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు ఎంపీపీ స్కూల్‌లో అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం నిర్వహించారు.
Achanta: పోడూరు ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం!
ఆచంట: పోడూరు జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరను కాపాడుకోవలసిన బాధ్యత అఃదరిపైనా ఉన్నదని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లాబత్తుల సూర్య కుమార్ అన్నారు.
అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కకరించుకుని బుధవారం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్బంగా హెడ్మాస్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా 'అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం'ని నిర్వహిస్తారని, దీనినే ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఆని కూడా పిలుస్తారని,
భూమి పై ఉన్న జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందని,అందుకే మొక్కలను నాటి సంరంక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, యస్.యం.సి సభ్యులు పాలచగొన్నారు.




