Yalamanchili: యలమంచిలి కూటమి ఎంపీపీ అభ్యర్థిగా తాళ్ల నాగరాజు నామినేషన్!

Yalamanchili: పాలకొల్లు నియోజకవర్గంలో జోరుగా నామినేషన్లు. యలమంచిలి కూటమి ఎంపీపీ అభ్యర్థిగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆశీస్సులతో తాళ్ల నాగరాజు నామినేషన్ దాఖలు.

S VENKAT, PALAKOLLU
Published on: 23 Oct 2026 11:46 PM IST
Yalamanchili
X

Yalamanchili: యలమంచిలి కూటమి ఎంపీపీ అభ్యర్థిగా తాళ్ల నాగరాజు నామినేషన్!

యలమంచిలి: పాలకొల్లు నియోజక వర్గంలో మూడవ రోజు నామినేషన్లు జోరుగా సాగాయి. యలమంచిలి మండలం లో ఎంపీపీ అభ్యర్థిగా కూటమి బలపరచిన అభ్యర్థి తాళ్ల నాగరాజు పోటీ చేస్తున్నారు.

ఈ రోజు ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ నియోజక వర్గంలో కూటమి ప్రభుత్వం అభివృద్ది పదంలో కూటమి నడిపిస్తున్నారని జలవనరుల శాఖా మంత్రి రామానాయుడు ఆశీర్వాదంతో కూటమి ఎంపీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నాను.

అనీ మరియు నియోజక వర్గంలో కూటమి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని అయన కోరారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU