Poduru: పాఠశాల విద్యార్థులకు రూ. 20 వేలు విద్యాసామగ్రి పంపిణీ

Poduru: బుల్లేటిగుంట మోడల్ స్కూల్‌లో గొల్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.20 వేల స్కాలర్‌షిప్‌ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నేత పద్మారావు.

E.ABRAHAM, ACHANTA
Published on: 1 July 2026 9:50 PM IST
Poduru
X

Poduru: పాఠశాల విద్యార్థులకు రూ. 20 వేలు విద్యాసామగ్రి పంపిణీ

పోడూరు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సాయం ఎంతో అవసరమని బిజెపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్ యర్రంశెట్టి పద్మారావు అన్నారు. పోడూరు మండలం మట్టపరు శివారు బుల్లేటిగుంట మోడల్ స్కూల్ లో బుధవారం శ్రీ మూర్తి గొల్ల ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు రూ. 20 వేలు స్కాలర్ షిప్ లు, సర్టిఫికెట్లు, విద్యాసామగ్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎర్రంశెట్టి పద్మారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ఉన్నతికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే పొందవచ్చుని తల్లిదండ్రులకు సూచించారు. మట్టపర్రు మాజీ సర్పంచులు దొమ్మేటి శ్రీను, గోగులమండ రాంజీ అంబేద్కర్ వార్డు సభ్యులు, కస్తరించార్జ్ సిహెచ్ శివ జ్యోతి, ఎస్ఎంసి చైర్మన్ కొప్పాడి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ..

విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందుపుచ్చుకుని ప్రభుత్వ పాఠశాలల విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ట్రస్టీ గొల్ల రాజు దంపతులను ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ట్రస్ట్ కుటుంబ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story