Yelamanchili: యలమంచిలిలో కూటమి అభ్యర్థుల జోరుగా ప్రచారం

Yelamanchili: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో కూటమి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించి, టీడీపీ సీనియర్ నేత వాసు రాజు ఆశీస్సులు తీసుకున్నారు.

S VENKAT, PALAKOLLU
Published on: 30 Oct 2026 10:11 PM IST
Yelamanchili
X

Yelamanchili: యలమంచిలిలో కూటమి అభ్యర్థుల జోరుగా ప్రచారం

యలమంచిలి: యలమంచిలి మండలంలో కూటమి బలపరచిన జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కొడవటి నాగలక్ష్మి వరబాబు, ఇంకా ఎంపీపీ కూటమి అభ్యర్థి పీతల శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం లో భాగంగా యలమంచిలి, లంకపాలెం, చించినాడ, కట్టు కాలవ, దొడ్డిపట్ల గ్రామాలలో కూటమి నాయకులు మరియు అభిమానులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్పీటీసీ నాగలక్ష్మి భర్త వరబాబు, ఎంపీపీ శ్రీనివాస్ నేరేడుమిల్లి గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు వాసురాజు ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వాసురాజు మాట్లాడుతూ కూటమి తోనే అభివృద్ధి జరుగుతుందని టీడీపీ హయాంలోనే సంక్షేమం కూడా జరుగుతుందని అందుచేతనే మన మంత్రి నిమ్మల రామనాయుడికి జలవనరుల శాఖ ను ఇచ్చారని అయన అన్నారు.

మనం అందరం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ కీ సహకరించాలని అయన కోరారు. కూటమి అభ్యర్థుల ను గెలిపించి నియోజక వర్గంలో అన్ని మండలాలను ఇంకా అభివృద్ధి చేసే విధంగా అందరూ సహకరించాలని అయన కోరారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU