Tanuku: వైఎస్సార్సీపీ ఆఫీస్‌లో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ!

Tanuku: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో "జగన్ 2.0 సూపర్ యాప్" ఆవిష్కరణ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 18 July 2026 10:07 PM IST
Tanuku
X

Tanuku: వైఎస్సార్సీపీ ఆఫీస్‌లో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ!

తణుకు: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావుఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో " జగన్ 2.0 సూపర్ యాప్ " ఆవిష్కరణ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని, వారిని మరింత బలోపేతం చేయడం, పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలకు నేరుగా అనుసంధానం చేయడం, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతోనే "జగన్ 2.0 సూపర్ యాప్" ను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు.

ప్రతి కార్యకర్త ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, వేధింపులు, కేసుల వివరాలను ఈ యాప్ ద్వారా నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని కోరారు. గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story