Palakollu: పాలకొల్లులో వైఎస్సార్‌సీపీ సమావేశం
Palakollu: పాలకొల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుకాపు కార్పొరేషన్ అంశాలపై కీలక సమావేశం జరిగింది.
Palakollu: పాలకొల్లులో వైఎస్సార్‌సీపీ సమావేశం
Palakollu: పాలకొల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు తూర్పుకాపు కార్పొరేషన్ మరియు ఇతర అంశ్యలపైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
తూర్పుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారుగా 18 నెలలు కాలం గడిచిన నిధులు విధులు కేటాయింపు ఊసే లేదు. ఉత్తరాంధ్రలో మినహా జిల్లాల్లో తూర్పుకాపులకు నామినేటెడ్ పదవుల విషయంలో మొండి చెయ్యి చూపించిన కూటమి ప్రభుత్వం.
బిసీలకు ప్రత్యేక రుణాలకు సంబంధించి బ్యాంకులు ఏర్పాటు చేస్తానన్న హామీ ఏమైంది అని కోరాడ శ్రీనివాసరావు గారు ప్రశ్నించారు.
తూర్పుకాపు లకు ఉత్తరాంధ్ర మినహా జిల్లాలో ఓబీసీ రిజర్వేషన్ అంశ్యం పై గడిచిన రెండు సంవత్సరాలో ncbc లో ఏ ఫలితాలు వచ్చాయో కూటమి లో నాయకులు తెలపాలి.
తూర్పుకాపు సామాజిక భవనాలకు స్థల కేటాయింపులు భవన నిర్మాణానికి ఆర్థిక నిధి కేటాయించే విధంగా చర్యలు ఏమైనా తీసుకున్నారా? తీసుకుంటారా?
తూర్పుకాపు కార్పొరేషన్ లో విదేశీ విద్యకు సంబంధించి ప్రత్యేక నిధిని కేటాయింపులు ఏమైనా చేస్తారా?
జన గణనతో పాటు కుల గణన జరిగితేనే రాష్ట్రంలో తూర్పుకాపులు సంఖ్య బయటకు వస్తుందని తద్వారా కార్పొరేషన్ నిధులు నామినేట్ పదవుల్లో పార్టీ పదవుల్లో న్యాయం జరుగుతుందని.
ఈ దిశగా ఏమైనా ప్రత్తిపాదనలు కూటమి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తారా?
కార్పొరేషన్ నిధిని ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రుణ సదుపాయం సిబిల్తో cibil ముడి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో జరుగుతున్న మన తాలూకా వివక్షత ఆర్ధిక, విద్యా, ఉద్యోగ పరిస్థితుల పై వినతిపత్రం ఇచ్చే దిశగా కూటమి నాయకుల అడుగులు వేయాలని ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తూర్పు కాపు సామాజిక వర్గానికి రానున్న రోజుల్లో మేలు చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని రాజకీయ రిజర్వేషన్లు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి తమ ధర్మాన్ని పాటించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లోపింటి చిరంజీవి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జమ్ము మృత్యుంజయరావు, ఎడ్ల సత్యనారాయణ, పిల్ల శ్రీనివాసరావు, లోపింటి శ్రీనివాస్, మామిడి సత్యనారాయణ, రూమ్కాని దుర్గారావు, తాళ్లపూడి దేశాలరావు, రఘుమండ రాజు, మీసాల దాన నరసింహులు, రోనంకి శ్రీనివాస్, యంధం శ్రీనివాస్, కొర్ర ఆనందరావు, లోపింటి మురళీకృష్ణ, పనస శ్రీనివాస్, పిల్ల అప్పాజీ, సిరిపురపు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.




