Tanuku: వైకాపా నిరసన.. రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్!
Tanuku: తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ అరెస్టును ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసన చేపట్టారు.
Tanuku: వైకాపా నిరసన.. రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్!
తణుకు: రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేశారని వైకాపా నాయకులు ఆరోపించారు. కారుమూరి అరెస్టును ఖండిస్తూ వైకాపా నాయకులు సోమవారం పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ప్రజల్లో నిరంతరం ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న కారుమూరి గొంతును అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని, ఆయన కుమారుడు సునీల్ కుమార్ను కూడా అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని విమర్శించారు.
రాష్ట్రంలో బలమైన నాయకులను అణచివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కారుమూరి అండగా నిలుస్తామని నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు మారిశెట్టి శేషగిరి, సాయిబాబు రెడ్డి, ఇడుగుపల్లిబాలరామకృష్ట, ఉండవల్లి జానికి తదితరులు పాల్గొన్నారు.




