Tanuku: మాజీ సర్పంచ్ ఇల్లు కూల్చివేతపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం!

Tanuku: ణుకు నియోజకవర్గం అయితంపూడిలో మాజీ సర్పంచ్ లావణ్య ఇంటి కూల్చివేతను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలత తీవ్రంగా ఖండించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 22 Aug 2026 8:42 PM IST
Tanuku
X

Tanuku: మాజీ సర్పంచ్ ఇల్లు కూల్చివేతపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం!

తణుకు: తణుకు నియోజకవర్గం అయితంపూడి గ్రామ మాజీ సర్పంచ్ లావణ్య ఇంటి కూల్చివేత ఘటనపై వైకాపా మహిళా ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కల్పలత బృందం శనివారం పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

అర్ధరాత్రి సమయంలో అధికారులను వెంటబెట్టుకుని వచ్చి మహిళా మాజీ సర్పంచ్ ఇంటిని కూల్చివేయడం దారుణమని పేర్కొన్నారు. కూటమి నేతలు చెప్పుకునే “డబుల్ ఇంజన్ ప్రభుత్వం” ప్రస్తుతం “బుల్డోజర్ ప్రభుత్వం”గా మారిందని విమర్శించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణగారు కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కాలం మారుతుంది, అధికారం కూడా మారుతుంది, మా టైం కూడా మాకు వస్తుంది. ఇలాంటి కక్షపూరిత ధోరణితో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న అందరికీ బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధముగా ఉన్నారు.

ఎమ్మెల్యే గారూ.. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఆంధ్రలో కాదు, అమెరికాలో ఉన్నా కూడా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న కొందరు అధికారులు ఎక్కడ దాక్కున్నా కూడా చట్టానికి అప్పగించి తీరుతాం” అని ఆమె హెచ్చరించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆయన కుమారుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో నాగేశ్వరరావు కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు రాజకీయంగా సమాధానం చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ అయితంపూడి మాజీ మహిళా సర్పంచ్ లావణ్య గారి ఇంటి కూల్చివేతను దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఒక రకమైన నిబంధనలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా ఉంటే మరో రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. రానున్న రోజుల్లో కారుమూరి తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రస్తుత పాలకులు “సినిమా చూస్తారని” ఆమె హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కనుమూరి విజయ దుర్గ, భీమవరం టౌన్ ప్రెసిడెంట్ చె. కృపామణి, భీమవరం 25వ వార్డు సెక్రటరీ పట్టెం శశితల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి మొగ్గ మంగ, ఎస్. ఎలిజిబెత్ రాణి, ఎస్. ఆశాజ్యోతి, బుద్ధరాజు సత్యాదేవి, తణుకు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, అత్తిలి మండల మహిళా అధ్యక్షురాలు కాకర్ల విశాలక్ష్మి, ఇరగవరం మండల మహిళా అధ్యక్షురాలు మెట్ల కిరణ్మయి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, షైక్ పాహిమా, టౌన్ మహిళా ప్రెసిడెంట్ నూకల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story