Tanuku: తణుకు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం.. వైసీపీ నేత బలరాం!
Tanuku: తణుకు పట్టణాన్ని అభివృద్ధి చేసి ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యిండుగపల్లి బలరామకృష్ణ తెలిపారు.
Tanuku: తణుకు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం.. వైసీపీ నేత బలరాం!
Tanuku: కూటమి ప్రభుత్వం చేయలేని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి తణుకు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తణుకు వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యిండుగపల్లి బలరామకృష్ణ అన్నారు.
మేరకు బుధవారం హెచ్ఎంటీవీ ప్రతినిధితో మాట్లాడుతూ తనకు పట్టణంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నదనేది పూర్తిగా అవగాహన ఉందని తాము అధికారంలోకి వస్తే మురికి వాడలతో పాటు జిల్లాలో తణుకు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
పట్టణంలో ఇప్పటివరకు ఒక ప్రణాళిక లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రహదారులు, డ్రైనేజీలు సైతం ప్రణాళిక బద్దంగా చేప్పటకపోవడంతో గతంలో ఎన్నడు లేని విధంగా పలు కాలనీలు ముంపునకు గురై పట్టణ ప్రజలు నాలుగు రోజులు పాటు జల దిగ్బంధంలో ఉన్నారని తెలిపారు. వీటన్నింటికీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే
44 మంది కౌన్సిలర్ల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలు, పట్టణ అభివృద్ధిపై చర్చించమన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు చైర్మెన్ అభ్యర్థిగా తాను, పట్టణంలో 44 వార్డుల్లో కౌన్సిలర్ల అభ్యర్థులు కలసి ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. పుర ప్రజలు మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని బలరాం కోరారు.




