తెలంగాణ నేపథ్యంగా రానున్న ఫీల్ గుడ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్.. డైరెక్టర్ ఎవరంటే?

మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాత్తగా అండ్ దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయ లక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రోడక్షన్ నంబర్ 1 సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్.

Arun Chilukuri
Published on: 11 Oct 2024 8:00 PM IST
తెలంగాణ నేపథ్యంగా రానున్న ఫీల్ గుడ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్.. డైరెక్టర్ ఎవరంటే?
X

మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాత్తగా, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయ లక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రోడక్షన్ నంబర్ 1 సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజయదశమి పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్ కి దక్కుతాయి అని భావిస్తున్నామని అన్నారు. కాగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు, ఈ సినిమాకు టెక్నీకల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ అవ్వనున్నట్టు తెలిపారు. అయితే, ఈ సినిమాలో నటినటులు వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ అన్నారు. ఈ సినిమాకు కథ వెంకట్ గౌడ్ అందించనుండగా, డైలాగ్స్ కర్రా నరేంద్ర రెడ్డి, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా అనిల్ గొడుగుల పనిచేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story