hmtv Mathru Shakthi Awards 2026: తెలుగు నవలా రచయిత్రి డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి కి హెచ్.ఎమ్.టి.వి 'మాతృశక్తి అవార్డ్-2026'

hmtv Mathru Shakthi Awards 2026: తెలుగు నవలా రచయిత్రి డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి కి హెచ్.ఎమ్.టి.వి 'మాతృశక్తి అవార్డ్-2026'

KVD Varma
Published on: 3 March 2026 9:18 PM IST
hmtv Mathru Shakthi Awards 2026: తెలుగు నవలా రచయిత్రి డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి కి హెచ్.ఎమ్.టి.వి మాతృశక్తి అవార్డ్-2026
X

hmtv Mathru Shakthi Awards 2026

hmtv Mathru Shakthi Awards 2026: తెలుగు నవలా రచయిత్రి డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి కి హెచ్.ఎమ్.టి.వి (HMTV) 'మాతృశక్తి అవార్డ్-2026' ప్రదానం

డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి

రచనా వ్యాసంగం: డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి. ఆమె అనేక నవలలతో పాటు కథలు, కవితలు రాశారు. ఆమె రచనలు పలు ప్రముఖ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి

విద్య - పరిశోధన: ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎం.ఏ పూర్తి చేసిన ఆమె, అదే విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు వారపత్రికలు - సాహిత్య వికాసం' అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌డి (Ph.D) పట్టా పొందారు

పురస్కారాలు: తెలుగు విశ్వవిద్యాలయం వారి 'కీర్తి పురస్కారం' - 'వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక అవార్డు' వంటి అనేక గౌరవాలను ఆమె గతంలో అందుకున్నారు

hmtv పురస్కారం: సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా హెచ్.ఎమ్.టి.వి 'మాతృశక్తి అవార్డ్-2026'తో ఆమెను ఘనంగా సత్కరించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.