Mrithyunjay Trailer: శ్రీ విష్ణు మృత్యుంజయ్‌ ట్రైలర్ రిలీజ్..ఉత్కంఠ రేపుతున్న వీడియో

Mrithyunjay Trailer
x

Mrithyunjay Trailer: శ్రీ విష్ణు మృత్యుంజయ్‌ ట్రైలర్ రిలీజ్..ఉత్కంఠ రేపుతున్న వీడియో

Highlights

శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ చిత్రం ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, భావోద్వేగ అంశాలతో ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియోకు మంచి స్పందన లభిస్తోంది.

మృత్యుంజయ్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.



మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలైన వీడియోలో కథా నేపథ్యం, పాత్రల రూపకల్పన ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు ప్రధాన పాత్రలో శ్రీ విష్ణు ప్రదర్శనపై ఆసక్తి పెంచుతోంది.

యాక్షన్, భావోద్వేగ అంశాలు మిళితమైన కథగా ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీ విష్ణు పాత్ర చుట్టూ సాగే కథాంశం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌కు లభిస్తున్న స్పందన చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories