

Nvidia CEO Jensen Huang: జెన్సన్ హువాంగ్‌కు భారీ షాక్.. 30 నిమిషాల్లోనే రూ.70 వేల కోట్లు ఆవిరి!
ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ స్థానంలో ఉన్న ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత సంబంధాలు, గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన వార్తలు ఆయన సంపదపై తీవ్ర ప్రభావం చూపినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.


EPS Pension Hike: పింఛనుదారులకు శుభవార్త.. కనీస పింఛను రూ.3 వేలకు పెంపు?
ఉద్యోగుల పింఛను పథకం (EPS) కింద పింఛను పొందుతున్న లక్షలాది మందికి త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు ఇస్తున్న కనీస పింఛను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ మధ్య సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది.


Detergent Price Hike: సామాన్యులకు షాక్.. సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు పెంపు!
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు మరో షాక్ తగిలింది. ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్లైన సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలను పెంచుతూ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) నిర్ణయం తీసుకుంది. వివిధ ఉత్పత్తుల ధరలను గరిష్ఠంగా 11 శాతం వరకు పెంచినట్లు వెల్లడించింది.


Biggest Divorce Deal: బిల్ గేట్స్ రికార్డు బద్దలవుతుందా? లోరి హువాంగ్‌కు రూ.6.4 లక్షల కోట్లు!
ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం మాత్రమే కాదు.. ఆస్తుల పంపకాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నారు. దశాబ్దాల వైవాహిక బంధానికి ముగింపు పలికే సమయంలో వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు చేతులు మారుతున్నాయి.


Onion Prices Hike: ఉల్లి కొనాలంటే భయమే.. తెలంగాణలో కిలో రూ.80!
తెలంగాణలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసర కూరగాయల్లో ఒకటైన ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో ప్రతిరోజూ వంటల్లో ఉల్లిని వినియోగించే మధ్యతరగతి, పేద కుటుంబాల గృహ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.


HDFC Interest Rates: HDFC బ్యాంక్ కస్టమర్లకు షాక్.. పెరగనున్న లోన్ ఈఎంఐలు!
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ఖాతాదారులకు కీలక షాక్ ఇచ్చింది. రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (MCLR)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కాలపరిమితులపై గరిష్ఠంగా 15 బేసిస్ పాయింట్ల (0.15 శాతం) వరకు వడ్డీ రేట్లను సవరించింది.


రెండో పెళ్లి విఫలం.. విడాకుల తర్వాత మళ్లీ ఒక్కటైన సినీ జంట!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణమే. అయితే విడిపోయిన తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఒక్కటై తమ వైవాహిక జీవితానికి మరో అవకాశం ఇచ్చే జంటలు చాలా అరుదు. అలాంటి అరుదైన ప్రేమకథకు దక్షిణాది సినీ నటులు రంజిత్, ప్రియా రామన్ దంపతులు ఉదాహరణగా నిలిచారు.


Nellore: మూలస్థానేశ్వరాలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!
నెల్లూరు మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ఆకాశదీపం వెలిగించి పూజలు చేశారు. మేయర్ రూప్ కుమార్ స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించడంతో ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రమాదేవి ఆకాంక్షించారు.


Kurnool: కర్నూలులో లారీ చోరీ కేసు ఛేదన: ఇద్దరు నిందితుల అరెస్ట్!
కర్నూలులో రూ.10 లక్షల విలువైన లారీ చోరీ కేసులో ముజాఫర్ నగర్‌కు చెందిన సతీష్, గోపాల్‌లను పోలీసులు పందిపాడు వద్ద అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీర్చేందుకు డ్రైవర్ సతీష్, 8 కేసులున్న పాత నేరస్థుడు గోపాల్‌తో కలిసి చోరీకి పాల్పడ్డాడు. వీరిపై పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచారు.


Amalapuram: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి: డీఆర్వో!
అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్లో పంచాయతీ ఎన్నికల పీవోలు, ఏపీవోలకు శిక్షణ నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని, సందేహాలను ఇక్కడే నివృత్తి చేసుకోవాలని డీఆర్వో వి.సుబ్బారావు సూచించారు. బ్యాలెట్ బాక్సులు, ఓట్ల లెక్కింపు, కోడ్ అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.


Banswada: హన్మాజీపేట పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు
యువత చెడు వ్యసనాలకు, మోసాలకు ఆకర్షితులు కాకుండా, మంచి లక్ష్యంతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించి,తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, పోలీసు అధికారులు విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం కామారెడ్డి జిల్లా పోలీసు ల ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


Amalapuram: గాయపడిన ఉద్యోగికి కమిషనర్ కృష్ణ తేజ ఐఏఎస్ ఆర్థిక సాయం!
రోడ్డు ప్రమాదంలో కాలు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలవరం జిల్లా వీఆర్ పురం ఏపీఓకు కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ ఐఏఎస్ మానవతా దృక్పథంతో రూ.25,000 తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. కోనసీమ జిల్లా పీడీ జి.ఎస్. రాంగోపాల్ ద్వారా ఈ సాయాన్ని అందజేయగా, ఉద్యోగుల పట్ల ఆయన చూపిన ఆదరణపై ప్రశంసలు వెల్లువెత్తాయి.