

Parkal: పరకాలలో మహిళను కత్తితో బెదిరించిన నిందితుడి అరెస్ట్!
పరకాల పట్టణంలో మహిళను కత్తితో బెదిరించి వేధించిన నిందితుడిని పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల పట్టణంలోని బట్టల దుకాణం మరియు వాణి బుక్ స్టాల్ గల్లీలోని ఓ కిరాణా షాప్ వద్ద 28.10.2026 తేదీన ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.


Chilakaluripet: చిలకలూరిపేట మున్సిపాలిటీ జనసేన వశం:!
చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ పీఠాన్ని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో జనసేన అభ్యర్థిని తోట రాజరాజేశ్వరి ప్రత్యర్థులపై 29124 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన ఆమె, రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు.


Amanagallu: ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం దళితులకే కేటాయించాలి!
ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చరిత్రలో తొలిసారిగా దళిత సామాజిక వర్గానికి చైర్మన్ పదవి కల్పించాలని కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22తో ప్రస్తుత చైర్మన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పసుపుల జంగయ్యకు అవకాశం కల్పించాలని కోరారు.


Bhadrachalam: ఆర్టీసీ కండక్టర్ ప్రవల్లిక చికిత్స పొందుతూ మృతి భద్రాచలంలో నిరసనలు!
భద్రాచలం గత నెల 25వ తేదీన మిట్టగూడెం స్టేజీ వద్ద చోటుచేసుకున్న ఘటనలో బస్సు కండక్టర్ ప్రవల్లిక తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికురాలు నెట్టివేయడంతో బస్సు టైర్ల కింద పడిన ప్రవల్లికకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో పది రోజుల పాటు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు.


Kothagudem: భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాదాల నివారణకు పోలీసులు ఆయా రహదారులపై రాకపోకలను నిలిపివేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర భద్రతా లోపం - వెంటిలేటర్ల చోరీ!
ఆదిలాబాద్ రిమ్స్ లో తీవ్ర భద్రత లోపం చోటు చేసుకుంది. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్లను ఇద్దరు నిందితులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 30న రిమ్స్ లోని రెండో అంతస్తులో ఉన్న ఆర్ఐసియు విభాగంలో సంఘటన చోటు చేసుకుంది.


B.Savaram: వికలాంగుడి ఇంటికి పునరుద్ధరించిన విద్యుత్ సరఫరా!
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని బి.సావరం గ్రామంలో రెండు చేతులు లేని నిరుపేద వికలాంగుడి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం సాయంత్రం విద్యుత్ సిబ్బంది బాధితుడి ఇంటికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.


Narva: నర్వ మండలం కుమార్లింగంపల్లి బాధితుడికి రూ.4 లక్షల ఎల్ఓసీ అందజేత!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారి సహకారాలతో,నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్ మరియు జగధాభి రాం రెడ్డి గారి..సమక్షంలో మక్తల్ నియోజకవర్గం: నర్వ మండలంలోని కుమార్ లింగంపల్లి గ్రామ నివాసి, టీ తిరుపతి గారికి ₹4 లక్షల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) అందజేయడం జరిగింది.


Palnadu: పెదకూరపాడులో తుఫాన్ బీభత్సం వరద నుండి 6 గురిని కాపాడిన పోలీసులు!
పెదకూరపాడు నియోజకవర్గంలో మురసు తుఫాన్ ఎఫెక్ట్పొం. గి పొర్లుతున్న వాగులు,వంకలు. క్రోసూరు మండలం అందుకూరు గారపాడు లమధ్య ఉన్న బ్రిడ్జిపై వరద ప్రవాహం. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు. కారులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన పోలీసులు.


Nellore: నెల్లూరు కార్పొరేషన్‌పై కూటమి జెండా 80 వేల పైచిలుకు మెజారిటీతో మేయర్‌గా రూప్ కుమార్!
నెల్లూరు నగర రాజకీయాల్లో కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి కైవసం చేసుకుంది. అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో భారీ మెజారిటీతో రూప్ కుమార్ మేయర్‌గా ఎన్నికయ్యారు.


Mallampally: ఘనంగా కేతి బచావో అభియాన్ సాగుభూమి సంరక్షణ సమావేశం!
కేతి బచావో అభియాన్ (సాగుభూమి సంరక్షణ కార్యక్రమం) సమావేశం మల్లంపల్లి గ్రామం లో చిట్టిరెడ్డి మల్లారెడ్డి మిరప మల్చింగ్ క్షేత్రం నందు నవంబర్ 3 వ తేదీ మంగళ వారం నిర్వహించడం జరిగింది.


Palnadu: అచ్చంపేట మండలంలో భారీ వర్షాలు!
Palnadu: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రత్తి, మిరప, బొప్పాయి, మొక్కజొన్న పంటలు.