

Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన.. శ్రీకాకుళానికి రెడ్ అలర్ట్!
అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.


Lion: గుజరాత్‌లో విషాదం.. బావిలో పడి సింహం మృతి.. 24 గంటల్లో రెండు సింహాలు మృతి!
గుజరాత్‌లో ఆసియా సింహాల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో కేవలం 24 గంటల వ్యవధిలో రెండు సింహాలు ప్రాణాలు కోల్పోయాయి. అమ్రేలి జిల్లాలో వ్యవసాయ బావిలో పడి ఓ సింహం మృతి చెందగా, జునాగఢ్ జిల్లాలో విద్యుదాఘాతానికి గురై మరో సింహం మరణించింది.


Anirudh Wedding Video: అనిరుధ్ పెళ్లి ఫోటోలు వైరల్.. ‘నాకు అత్యంత ఇష్టమైన మాయాజాలం’ అంటూ వీడియో షేర్!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన వివాహ వేడుకకు సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్రీస్‌లో జరిగిన తన పెళ్లి వేడుకలో భార్య కావ్య మారన్‌తో కలిసి దిగిన ఫొటోలతో రూపొందించిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.


Karimnagar: ట్రినిటీ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన
‘నషా ముక్తి భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనగరంలోని ట్రినిటీ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ (మాదకద్రవ్యాల) వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.


Cyclone Akvan: అక్వాన్ తుఫాను ఎఫెక్ట్.. ఒడిశాలో 70 మొబైల్ టవర్లు, 197 DG సెట్లు సిద్ధం!
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అక్వాన్ తుఫాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం కలగకుండా, అత్యవసర సమాచార వ్యవస్థను పటిష్టం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టింది.


Makthal: దక్షిణ కొరియాలో విజయ్ భాస్కర్ రెడ్డికి అవార్డు
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిష్ఠాత్మకమైన CEO CLUB లక్ష్యాన్ని సాధించినందుకు మక్తల్‌కు చెందిన విజయ్ భాస్కర్ రెడ్డికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో ఘనంగా అవార్డు ప్రదానం చేశారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్దేశించిన CEO CLUB అర్హతలో భాగంగా, ఒక సంవత్సరంలో రూ.50 లక్షల ఫ్రెష్ బిజినెస్ సాధించి ఈ అరుదైన గుర్తింపును పొందారు.


Secunderabad: పోలీసుల తీరుపై సీపీకి సుధీర్ రెడ్డి ఫిర్యాదు
పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలాగా వ్యవహరిస్తున్నారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు.సరూర్ నగర్, చైతన్యపురిలో జరిగిన అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులే కాంగ్రెస్ నాయకుల్లా, కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్ బి. సుమతిని కలిసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.


Karimnagar: భార్య ఆత్మహత్యకు కారణమైన భర్త అరెస్ట్
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం కోసం భార్యను వేధించి ఆత్మహత్యకు కారణమైన భర్త అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో వివాహిత శ్రావంతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆమె భర్త కొత్తూరి సంపత్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Urkonda: మృతుడి కుటుంబానికి తలసాని అనిల్‌రెడ్డి ఆర్థిక చేయూత
మండల కేంద్రానికి చెందిన ఆకుల ఈశ్వరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్, తలసాని అనిల్‌రెడ్డి (TAR) మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు. కాంగ్రెస్ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అనిల్‌రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.


Uppununthala: ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ఒకటి పరార్
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం దసర్లపల్లి గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఒక ట్రాక్టర్ పరారయ్యింది. మిగిలిన రెండు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.


Government Holidays 2027: సోషల్ మీడియాలో ప్రభుత్వ సెలవులపై తప్పుడు ప్రచారం.. PIB ఫ్యాక్ట్ చెక్‌తో అసలు విషయం వెల్లడి!
2027లో ఢిల్లీ, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రకటించిన మతపరమైన సెలవుల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.


Karimnagar: అద్వైత యూత్ పార్లమెంట్‌లో డిప్యూటీ మేయర్
ఉన్నత చదువులు చదివిన యువత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడే దేశ రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు సాధ్యమవుతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని, నిత్యం వార్తాపత్రికలు చదువుతూ, పార్లమెంట్ మరియు అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తూ సమకాలీన రాజకీయాలపై పట్టు సాధించాలని సూచించారు.