

Hyderabad: ఒంటరి ప్రయాణాలకు స్వస్తి పలకండి: సైబరాబాద్ సీపీ ఎం. రమేష్ పిలుపు!
నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వాహనదారులు ఒంటరి ప్రయాణాలకు స్వస్తి పలికి కార్‌పూలింగ్, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మంగళవారం పిలుపునిచ్చారు. రాయదుర్గం టీ హబ్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


Parkal: పరకాల మున్సిపల్ సిబ్బందికి చైర్మన్ పావుశెట్టి సునీల్ బట్టల పంపిణీ!
పరకాల మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి చైర్మన్ పావుశెట్టి సునీల్ మంగళవారం స్వయంగా బట్టలు పంపిణీ చేశారు. పట్టణ పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడుతూ, వారి సంక్షేమం, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Kanchanbagh: కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధి జీఎం నగర్‌లో అగ్నిప్రమాదం!
కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీఎం నగర్‌లో ఒక ఇంట్లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది.


Kodad: కోదాడలో విషాదం.. లారీ ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి!
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు శివారులో మంగళవారం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో గుడిబండకు చెందిన ఏడో తరగతి విద్యార్థి షేక్ నాగుల్ (13) అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొనగా, మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ప్రపంచాన్ని సవాల్ చేస్తోన్న 7 మ్యాథ్స్ ప్రాబ్లమ్స్.. రెండింటినే పరిష్కరించిన ఏఐ.. మిగతా వాటి పరిస్థితి ఇదే..!
గణిత ప్రపంచంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఏడు అత్యంత క్లిష్టమైన సమస్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అమెరికాకు చెందిన క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఒక్కో సమస్యను పరిష్కరించిన వారికి 10 లక్షల డాలర్ల బహుమతిని ప్రకటించింది. అయితే తాజాగా ఏఐ సాయంతో రీమాన్ హైపోథిసిస్, నేవియర్–స్టోక్స్ సమస్యలను పరిష్కరించినట్లు వేర్వేరు ప్రకటనలు రావడం ఆసక్తి రేపుతోంది.


ఏలియన్ మెదడులా ఏఐ.. మనుషులు అర్థం చేసుకోలేరు.. మెటా ఏఐ చీఫ్ షాకింగ్ కామెంట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధిపై మెటా చీఫ్ AI ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ కీలక హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో AI వ్యవస్థలు మనుషుల కంటే ఎన్నో రెట్లు తెలివిగా మారవచ్చని అన్నారు. అవి ఏలియన్ మెదడులా పనిచేస్తాయని, వాటి సామర్థ్యాన్ని మనుషులు పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.


200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో మోటోరోలా సిగ్నేచర్ 27.. డిసెంబర్ 9న భారత్‌లో లాంచ్..!
మోటోరోలా సిగ్నేచర్ 27 ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విడుదలైంది. అక్కడ దీని ప్రారంభ ధర 1,599 డాలర్లు (సుమారు రూ.1.51 లక్షలు). భారత్‌లో లాంచ్ గురించి అక్టోబర్‌లో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కంపెనీ ధ్రువీకరించింది. తాజాగా డిసెంబర్ 9 తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ఇవే.


Mustabad: మణిదీప్ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన జోగినిపల్లి సంతోష్ కుమార్!
ముస్తాబాద్ మండలం బండనకల్‌కు చెందిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్ర అటెండర్ మణిదీప్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కేసీఆర్ ఆదేశాలతో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మంగళవారం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. మణిదీప్ చెల్లెలి చదువు, పెళ్లి బాధ్యతలను కేసీఆర్ తీసుకుంటారని హామీ ఇచ్చారు.


Kadiri: చలో ఢిల్లీని జయప్రదం చేయాలి.. బీడీ కార్మికులకు సీఐటీయూ పిలుపు
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని బీడీ నివాస ప్రాంతాల్లో (నిజాంవళి కాలనీ) చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అంబానీ అదాని, రిలయన్స్ పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చింది.


Kothagudem: రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ ద్వారా రూ.1.5 లక్షల ఉచిత వైద్యం!
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుతుందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి కేసు కింద భద్రాచలం ఆసుపత్రిలో స్వరాజ్యం అనే బాధితురాలికి రూ.22 వేల విలువైన ఉచిత చికిత్స అందించగా, డీఆర్ఎం బాలాజీ, సీఐ రాజు ఆసుపత్రిలో పరామర్శించారు.


Nellore: నెల్లూరు నూతన మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు అధికారుల శుభాకాంక్షలు
నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్ ను కమిషనర్ వై.ఓ. నందన్,స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ అదనపు కమిషనర్ హిమబిందు కార్యాలయ వివిధ విభాగాల ఉన్నతాధికారులు మంగళవారం కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఆయనను కలుసుకొని మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.


Pakistan Sindh Protests: పాకిస్థాన్‌లో మళ్లీ విభజన సెగలు.. ప్రత్యేక ‘సింధుదేశ్’ కోసం భారీ ఉద్యమం!
పాకిస్థాన్‌లో సింధ్ ప్రావిన్స్ విభజన ప్రతిపాదనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరాచీలో వేలాది మంది ర్యాలీ నిర్వహిస్తూ ప్రత్యేక సింధుదేశ్ కోసం డిమాండ్ చేశారు. అసిమ్ మునీర్ సైనిక వ్యవస్థపై ఆరోపణలు, ఉద్యమం వెనుక కారణాలు తెలుసుకుందాం.