

Badvel: బద్వేలు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ దివ్య తేజ!
మొత్తం బద్వేలు మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా 39 వార్డులు ఏకగ్రీవంగా టిడిపి కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నిక కావడం జరిగింది. కేవలం 39 వ వార్డులో మాత్రమే ఎలక్షన్ జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. బద్వేల్ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ సోమేశుల దివ్య తేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


Kurnool: కర్నూలు 24వ వార్డు జనసేన అభ్యర్థిగా తోళ్ళ మల్లేశ్వరి
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ 24వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా తోళ్ళ మల్లేశ్వరి బరిలో నిలిచి, వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రచారం ముమ్మరం చేశారు.


Guntur: గుంటూరులో టపాసుల దుకాణాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Guntur: దీపావళి పండుగ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తాడేపల్లి, మంగళగిరి, నగరంపాలెం పరిధిలోని టపాసుల దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.


Bheemili: భీమిలి 3వ వార్డులో కూటమి జోరు: గంటా రవితేజ ప్రచారం!
జీవీఎంసీ 3వ వార్డులో కూటమి అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మి గారి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ యువనేత గంటా రవితేజ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుని, కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని కోరారు.


Kurnool: ప్రత్యుష విజయానికి కూటమి నేతలు పనిచేయాలి: దస్తగిరి
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ టీడీపీ మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల ప్రత్యుష విజయానికి కూటమి నాయకులు సమన్వయంతో కృషి చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి పిలుపునిచ్చారు.


Anandapuram: ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు: ఆనందపురం సీఐ హెచ్చరిక!
ఆనందపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. ఎన్నికల్లో మద్యం, నగదు పంచితే చర్యలు తప్పవని హెచ్చరిక. అక్రమాలపై డయల్ 112 లేదా CI 7382296908, SI 7382296911కు తెలపాలని సూచన.


Kadiri: కదిరిలో సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: ఓబులు
Kadiri: కదిరి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని, స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలని సీపీఎం నేత జి. ఓబులు డిమాండ్ చేశారు.


Gopanpally: గోపన్‌పల్లిలో కిడ్నాప్ కలకలం.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Gopanpally: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లిలో ఇన్నోవా కారులో కిడ్నాప్‌నకు గురైన శ్యామ్ అనే యువకుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే రక్షించారు.


Chintoor: చింతూరులో ‘బీ-ఫాం’ ఉత్కంఠ: కూటమి నేతల్లో టెన్షన్!
చింతూరు మండలంలో జరిగే ఎంపీటీసీ జడ్పిటిసి సమరంలో కూటమి తరపున ఏ అభ్యర్థులు బరిలో నిలుస్తారు ?ఎవరు నిష్కమిస్తారు ? అనే దాని పై తీవ్ర ఉత్కంఠ కూటమి నాయకులలో నెలకొంది. చింతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పిటిసి స్థానానికి గాను జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.


Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో 'ఓట్ బచావో - దేశ్ బచావో' సన్నాహక భేటీ
Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో 'ఓట్ బచావో దేశ్ బచావో' సమీక్ష జరిగింది. నవంబర్ 1న భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు.


Nellore: అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే చర్యలు: జేసీ హెచ్చరిక!
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేసేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని, మేయర్ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు సూచించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు.


Bijinapally: పాలెం వేంకటేశ్వర స్వామికి వెండి లక్ష్మీహారం సమర్పణ
Bijinapally: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రాముగౌడ్, లలిత దంపతులు 301 గ్రాముల వెండి లక్ష్మీహారాన్ని సమర్పించారు.