తెలంగాణ
Logo
1 / 50
Telangana

Telangana: ఘనంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ ఆవిష్కరణ

15 Nov 2026 11:23 PM IST
This is an AI assisted summary.

తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఎనిమిదవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు సంబంధించిన లోగో, మస్కట్‌ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, క్రీడల ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి.

నల్గొండ & సూర్యాపేట
Logo
2 / 50
Suryapet

Suryapet: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం ద్వారా ప్రజా ప్రభుత్వం భరోసా

15 Nov 2026 11:20 PM IST
This is an AI assisted summary.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుటుంబానికి ఆధారంగా నిలిచే కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలిచేందుకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రవేశపెడుతోంది.

హైదరాబాద్
Logo
3 / 50
Secunderabad

Secunderabad: బోయిన్ చెరువులో ఘనంగా ఛట్ పూజ వేడుకలు

15 Nov 2026 11:14 PM IST
This is an AI assisted summary.

బోయిన్‌పల్లి బీహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోయిన్ చెరువు బతుకమ్మ కుంటలో చట్ పూజ వేడుకలను బీహార్ సోదరులు, కమిటీ సభ్యులు కలిసికట్టుగా అంగరంగ వైభవంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ హాజరై చట్ పూజలో పాల్గొన్నారు.

అమరావతి
Logo
4 / 50
Amaravati

మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు..రెండు కార్పొరేషన్లు.. మూడు మున్సిపాలిటీలకు అభ్యర్థుల ప్రకటన..

15 Nov 2026 11:06 PM IST
This is an AI assisted summary.

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు కార్పొరేషన్లతో పాటు మూడు మున్సిపాలిటీలకు సంబంధించి ఐదు కీలక పదవులకు అభ్యర్థుల పేర్లను జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.

అమరావతి
Logo
5 / 50
Amaravati

బీజేపీకి మాజీ MLC అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా....

15 Nov 2026 11:01 PM IST
This is an AI assisted summary.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరోసారి అసంతృప్తి స్వరం వినిపించింది. బాపట్లకు చెందిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు రాజీనామా లేఖ పంపించారు.

Advertisement
అమరావతి
Logo
6 / 50
Amaravati

సీఎం చంద్రబాబుతో వైఎస్‌ షర్మిల భేటీ..కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి రావాలని ఆహ్వానం..

15 Nov 2026 10:58 PM IST
This is an AI assisted summary.

Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమరావతిలో కలిసి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

అమరావతి
Logo
7 / 50
Amaravati

రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు...

15 Nov 2026 10:54 PM IST
This is an AI assisted summary.

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. రెండో విడతలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, 10 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలకు కమిషనర్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, నగర పంచాయతీలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది.

నల్గొండ & సూర్యాపేట
Logo
8 / 50
Suryapet

Suryapet: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు - పంతంగి దశరథ

15 Nov 2026 10:50 PM IST
This is an AI assisted summary.

వార్డులో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పంతంగి దశరథ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో యాతాకుల అంజలి జనార్ధన్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు.

ఖమ్మం
Logo
9 / 50
Kothagudem

Kothagudem: టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా మురళీమోహన్ ఎన్నిక

15 Nov 2026 10:47 PM IST
This is an AI assisted summary.

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 6వ మహాసభలు భద్రాచలం పట్టణంలోని రెడ్డి సత్రం (రాఘవ నిలయం)లో నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–2028 రెండేళ్ల కాలానికి నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నిజామాబాద్
Logo
10 / 50
Banswada

Banswada: ఇందిరా గాంధీ విగ్రహ పునఃప్రతిష్ఠాపన పనుల పరిశీలన

15 Nov 2026 10:44 PM IST
This is an AI assisted summary.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహ పునర్నిర్మాణా పనులను,ఆలాగే గత కొన్ని రోజుల క్రితం రోడ్డు వెడల్పు పనుల నిమిత్తం ఇందిరా గాంధీ విగ్రహాన్ని తీసి,పనులు పూర్తి చేసిన అనంతరం తిరిగి విగ్రహాన్ని ఈ రోజు పునః ప్రతిష్టింప జేసీ చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పరిశీలించారు.

Advertisement
కరీంనగర్
Logo
11 / 50
Jagtial

Jagtial: 13,913 మందికి కొత్త 'చేయూత' పింఛన్ల పంపిణీ

15 Nov 2026 10:41 PM IST
This is an AI assisted summary.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్‌లతో కలిసి జిల్లాలో కొత్తగా మంజూరైన 13,913 మందికి చేయూత పింఛన్ పత్రాలను మంత్రి అందజేశారు.

నల్గొండ & సూర్యాపేట
Logo
12 / 50
Suryapet

Suryapet: రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి శ్రీకృష్ణ ట్రస్ట్ ఎదగాలి

15 Nov 2026 10:37 PM IST
This is an AI assisted summary.

శ్రీకృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీసీ ఉద్యమ నాయకులు వట్టే జానయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు.