

Mydukur: చెక్క భజన మహిళా కళాకారులకు టీఎస్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం
గ్రామీణ సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ, కళాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో TSR సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరో ముందడుగు వేసింది. వనిపెంట గ్రామంలో అరుదైన సంప్రదాయ కళ అయిన 'చెక్క భజన'ను కొనసాగిస్తూ, తమ ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకుంటున్న ఇద్దరు మహిళా కళాకారులకు ట్రస్ట్ తరఫున రూ.10,000 ఆర్థిక ప్రోత్సాహక సహాయాన్ని అందజేశారు.


Thungathurthi: తుంగతుర్తిలో ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు!
స్వేరో నెట్‌వర్క్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా సోమవారం తుంగతుర్తిలో వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగడుపుల ఎల్లయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా, వెంపటిలో ఆయన కుమార్తెలు అయ్యప్ప, శివ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.


Kadiri: కుమ్మరవాండ్లపల్లిలో ఎమ్మెల్యే కందికుంట విస్తృత ప్రచారం
సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి మేజర్ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్. పార్థసారథి విస్తృతంగా పాల్గొన్నారు.


Bhadrachalam: పట్టభద్రులంతా ఓటు వేసి గెలిపించండి: జనసేన అభ్యర్థి గడల శ్రీనివాస్!
ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే భద్రాచలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిసేలా పాటుపడతానని మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ అన్నారు. సోమవారం భద్రాచలంలో కార్యకర్తలతో సమావేశమై ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు.


Guntur: పోలింగ్ సందర్భంగా నవంబరు 26, 29, డిసెంబరు 2న సెలవు
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ, పొన్నూరు మున్సిపాలిటీలో నవంబర్ 26వ తేదీన పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో స్థానిక సెలవును ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని చెప్పారు.


Guntur: డిసెంబరు 22న ఎస్ఐఆర్ తుది జాబితా.. ఎమ్మెల్సీ నమోదు పొడిగింపు
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా తుది జాబితాను డిసెంబరు 22న విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి యం సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సి యం సాయికాంత్ వర్మ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పాల్గొన్నారు. ఎస్ ఐ ఆర్, ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికల గురించి సమీక్షించారు.


Eluru: ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, డిప్యూటీగా శారద ఎన్నిక
ఏలూరు నగర మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు సోమవారం పదవీ స్వీకారం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆయనతో పాటు 62 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జరిగిన ఎన్నికలో డిప్యూటీ మేయర్‌గా పృధ్వి శారద ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించి,ధృవీకరణ పత్రం అందజేశారు.


Vetapalem: వేటపాలెంలో ఘనంగా జాతీయ జీడిపప్పు దినోత్సవ వేడుకలు
వేటపాలెం లో గల అనంత భారత్ క్యాషూ ప్రొడక్ట్స్ నందు జాతీయ జీడిపప్పు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్త ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ నాణ్యమైన జీడిపప్పు తయారీలో కార్మికుల యొక్క నైపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను ఘనంగా సత్కరించుట జరిగినది.


Nirmal: నిర్మల్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి షర్మిల!
నిర్మల్ జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని ఎస్పీ జానకి షర్మిల సోమవారం పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. శివాజీ చౌక్ నుండి బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆటంకాలను, ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరును తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Gambhiraopet: గంభీరావుపేటలో భారీ చోరీ.. 11 తులాల బంగారం అపహరణ!
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మారవేణి పరశురాములు కుటుంబం శుభకార్యానికి వెళ్లగా, దుండగులు ఇంటి తాళాలు, బీరువా పగులగొట్టి 11 తులాల బంగారం, 82 తులాల వెండి, రూ.లక్ష నగదు అపహరించారు. సోమవారం బాధితుడి ఫిర్యాదుతో గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Munugode: మునుగోడు పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో అండగా నిలుస్తోంది: ఎమ్మెల్సీ!
మునుగోడు నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ఎంతో అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. సోమవారం మునుగోడు సీపీఐ కార్యాలయంలో మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి, పేదలకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామన్నారు.


Basar: జాతీయ స్థాయిలో సత్తా చాటిన బాసర ఆర్జీయూకేటీ ‘టీమ్ వేగా’!
కోయంబత్తూరులో ఎఫ్ఎంఏఈ నిర్వహించిన జాతీయ ఎలక్ట్రిక్ రేసింగ్ బైక్ పోటీలో బాసర ఆర్జీయూకేటీ ‘టీమ్ వేగా’ ఈఈఈ విద్యార్థులు ఆల్ ఇండియా 7వ ర్యాంకు సాధించారు. పరిమిత వనరులతో సొంతంగా బైక్ రూపొందించి సత్తా చాటిన విద్యార్థులను వీసీ ప్రొ. ఏ. గోవర్ధన్ సోమవారం అభినందించి, భవిష్యత్ ప్రయోగాలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.