

Kanchili: పెద్ద ఖోజ్జిరియా గ్రామంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమం!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద ఖోజ్జిరియా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్ బొడ్డ సంధ్యారాణి ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, పార్టీలకతీతంగా మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.


Hyderabad: సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు!
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి బి.ఎం. సందీప్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.


Srisailam: శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వైభవంగా స్వర్ణరథోత్సవం!
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం అనంతరం లోకకల్యాణ సంకల్పంతో రథోత్సవం నిర్వహించారు. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Tirupati: సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎంపీటీసీ ఎలిజిబెత్!
తిరుమల పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు సల్మాన్ రాజు సతీమణి, తిరుచానూరు 5వ ఎంపీటీసీ జె.హెచ్. ఎలిజిబెత్ ఘన స్వాగతం పలికారు. టీడీపీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు.


Kanigiri: హుస్సేన్‌పురంలో అర్ధరాత్రి వరకు హైడ్రామా.. వైసీపీ అభ్యర్థి గెలుపు!
వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం పంచాయతీ ఎన్నికల లెక్కింపులో అర్ధరాత్రి వరకు హైడ్రామా నెలకొంది. విద్యుత్ నిలిపివేసి బ్యాలెట్ పత్రాలు చించివేశారని వైసీపీ ఆరోపిస్తూ ఆందోళన చేపట్టింది. దద్దాల నారాయణ యాదవ్ రాక, ఆర్డీవోను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొనగా, అర్ధరాత్రి ఒంటిగంటకు 17 ఓట్ల మెజార్టీతో గెలిచిన వైసీపీ అభ్యర్థి తమ్మినేని గురవమ్మకు డిక్లరేషన్ ఇచ్చారు.


V Hanumantha Rao: సీఎం నో చెప్పినా.. హన్మంతరావు తగ్గేదేలే!
V Hanumantha Rao: నెక్లెస్ రోడ్ రోటరీ వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నేత వి. హన్మంతరావు, ఎలాగైనా ప్రసంగించాలనే పట్టుదలతో చివరి నిమిషంలో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు.


Madgul: ప్రియుడు బన్నె శివతో కలిసి భర్తను కడతేర్చించిన భార్య గజ్జ అంజమ్మ!
రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం : రూ.18 లక్షల పరిహారం డబ్బుపై కన్నేసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.


Chinturu: జనసేన సైనికుడు నాగరాజు.. ముకునూరును మార్చే యువశక్తి!
చింతూరు మండలం ముకునూరు పంచాయతీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పాయం నాగరాజు ప్రతి గడపకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనసైనికులు ప్రవీణ్ కుమార్, సతీష్, రమణమ్మల ప్రచార హోరుతో ముకునూరు మారుమోగుతుండగా, యువకుడైన నాగరాజు గెలిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు మద్దతు తెలుపుతున్నారు.


Rangareddy: నీలకంఠం విష్ణు చిత్రపటానికి ఘన నివాళులర్పించిన అమర్ లింగన్న!
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు నీలకంఠం పాండు సోదరుడు నీలకంఠం విష్ణు దశదినకర్మ కార్యక్రమాన్ని గురువారం కుటుంబ సభ్యులు నిర్వహించారు.


Eluru: 1326 ఓట్ల భారీ మెజార్టీతో నామవరం సర్పంచ్‌గా సూరానేని రజిత!
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సూరానేని రజిత 1,326 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి, 12 వార్డులను కైవసం చేసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని రజిత, ఈ విజయాన్ని ఎన్టీఆర్‌కు అంకితం చేస్తున్నామని సూరానేని గోపి తెలిపారు.


Kukatpally: ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలి: ఎమ్మెల్యే మాధవరం!
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉండగా హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించడం సరికాదని విమర్శించారు. ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని కోరుతూ, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.


Devipuram Temple: శ్రీచక్రం ఆకృతిలో రాజరాజేశ్వరి ఆలయం... మహిళలే పూజారులు
ఆంధ్రప్రదేశ్‌లోని దేవీపురం రాజరాజేశ్వరి ఆలయం ప్రత్యేకతలు తెలుసా? 10 ఎకరాల్లో మహామేరు శ్రీచక్రం ఆకృతిలో నిర్మించిన ఈ ఆలయంలో మహిళలే అర్చకులుగా పూజలు నిర్వహిస్తారు.