

Chityala: నేరడలో చోరీ కేసు.. వారం రోజుల్లో నిందితుడి అరెస్ట్
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఈ నెల 16వ తేదీన సాగర్ల నర్సింహ తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం భావి వద్దకు వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం వచ్చి చూడగా తాళం వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో పెట్టిన నగదు ఐదు లక్షల రూపాయలు 2.5 గ్రాముల బంగారు దిద్దులు దొంగలించికెళ్లారు.


Talkondapally: పడకల్ గ్రామంలో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేత
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం గ్రామ సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరణ్య, ఏఎంసీ డాక్టర్ విజయలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ నాయకులు, పెద్దలు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.


Kadthal: చరికొండలో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేసిన సర్పంచ్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పోలియో రహిత భారతదేశమే లక్ష్యంగా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని చరికొండ గ్రామ సర్పంచ్ అద్దాల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం చరికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.


Chandrugonda: చలమల శ్రీనివాసరావు వర్ధంతి.. స్మృతివనంలో ఘన నివాళులు
అటవీ సంపద, మొక్కల పెంపకాన్ని పరిరక్షించే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన దివంగత అటవీ అధికారి చలమల శ్రీనివాసరావు నాలుగో వర్ధంతి సందర్భంగా ఆదివారం చంద్రుగొండ అటవీ రేంజ్ పరిధిలోని స్మృతివనంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.


Siddipet: సిద్దిపేట న్యాయవాది ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
సిద్దిపేట జిల్లా న్యాయవాది ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం అధికారికంగా కొలువుదీరింది. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా బోగారి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షురాలిగా ఏ. కరుణశ్రీ, ప్రధాన కార్యదర్శిగా పి. సుధీర్ రెడ్డి, కోశాధికారిగా రాకేష్ దేశపాండే ఎన్నికయ్యారు.


Banswada: బాన్సువాడలో నార్మల్ డెలివరీపై అవగాహన ర్యాలీ
సొసైటీ ఆఫ్ మిడ్ వైఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆఫర్ బర్తింగ్ కార్యక్రమాన్ని మాతా శిశు హాస్పిటల్ లో నర్సింగ్ కాలేజ్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయబాలరాజ్, మాతా శిశు హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ ప్రకాష్ రాథోడ్, కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ కలేక్, కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, సుల్తానా గౌస్ పాల్గొన్నారు.


Shabad: చందనవెల్లి ట్రీ ఫాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు
షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ట్రీ ఫాయిల్ (Treefoil) కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.


Nacharam: నాచారంలో పల్స్ పోలియో.. పోలియో రహిత సమాజానికి కృషి
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాచారం డివిజన్ భవానీ నగర్ కాలని అధ్యక్షుడు రాగిరి మోహన్ రెడ్డి సూచించారు. నాచారం డివిజన్ పరిధిలోని భవానీనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.


Manthani: 24న మంథనిలో గౌతమేశ్వర స్వామి కల్యాణం, జ్వాలాతోరణం
పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువుదీరిన శ్రీగౌతమేశ్వర స్వామి సమేత గంగాభవాని అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని, జ్వాలాతోరణ కార్యక్రమాన్ని, ఆలయంలో ఈనెల 24న మంగళవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించినున్నట్లు బండారి గురుస్వామి శిష్య పరివార్, ఆకుల విద్యాసాగర్ ఆదివారం తెలిపారు.


Karimnagar: కరీంనగర్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నిరవధిక ఆందోళన
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో భవన నిర్మాణం, హాస్టళ్ల అప్పగింతలో జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. గత రెండు రోజులుగా నిరవధికంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరారు. గతంలో బాలుర హాస్టల్లో నవంబర్ 20వ తేదీలోగా అప్పగిస్తామని చెప్పిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం అప్పగించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


Khammam: నవంబర్ 23న ఖమ్మం ప్రజావాణి రద్దు కలెక్టర్ దివాకర టిఎస్
పరిపాలనా అవసరాల దృష్ట్యా నేడు (నవంబర్ 23న) సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


Jinnaram: మాదారంలో వైభవంగా మహా పడిపూజ.. శరణుఘోషతో సందడి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మాదారం గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని జిన్నారం మండలం మాదారం గ్రామంలో ఎల్. సంపత్ గౌడ్ కత్తి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పడిపూజ భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. శబరిమలలోని పవిత్రమైన పద్దెనిమిది మెట్లను తలపించేలా నిర్వహించిన ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.