

Tuesday Horoscope: మంగళవారం లక్కీ రాశులు... పట్టిందల్లా బంగారమే
మంగళవారం రాశిఫలాలు... మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, కొత్త అవకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


Patancheru: ఆలయ నిర్మాణానికి రూ.70 లక్షలు ఇచ్చిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పరమత సహనాన్ని పెంపొందిస్తూ.. సొంత నిధులతో ఆలయాలు, చర్చిలు, మసీదులు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందిస్తున్నారు.


Nirmal: ఇందిరమ్మ బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లావ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శిబిరాల ఏర్పాట్లు, నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేరోజు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.


Amanagallu: ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పీఏసీఎస్ చైర్మన్‌గా నియమితులై బాధ్యతలు చేపట్టిన గూడూరు శ్రీనివాస్ రెడ్డికి సోమవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆమనగల్లు మండల పరిషత్ సమావేశ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, సిబ్బంది ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.


Tangallapally: ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్‌తో మెరుగైన ఉపాధి
విద్యార్థినుల్లో సృజనాత్మకత, వృత్తి నైపుణ్యాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్‌తో పాటు వివిధ వృత్తివిద్యా కోర్సుల ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.


Garidepally: లారీ ఢీకొని వ్యక్తి మృతి - గరిడేపల్లిలో బంధువుల ఆందోళన
సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం అప్పన్నపేట వద్ద నిన్న రాత్రి బైకును లారీ ఢీ కొట్టిన ఘటనలో భర్త మృతిచెందగా భార్యకు పూర్తిగా రెండు కాళ్లు విరగటంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించడం జరిగింది.


Ashwaraopeta: ఊట్లపల్లిలో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య వివాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. గ్రామపంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల నిర్వహణ అంశాలు ఇరువురి మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఆశ్రయించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Hyderabad: పాలిటెక్నిక్ కళాశాలల పీపీపీ ఉపసంహరణపై హర్షం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానం అమలును ఉపసంహరించుకుని, కళాశాలల కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ పాలిటెక్నీక్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 97ను, జీఓ ఎంఎస్ నంబర్ 157 ద్వారా సవరించడాన్ని స్వాగతించింది.


Madugula: అన్నేబోయినపల్లిలో 21 మందికి నూతన పెన్షన్ల మంజూరు
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అన్నేబోయినపల్లి గ్రామంలో అర్హులైన 21 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆమనగంటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. మంజూరైన పెన్షన్లలో రెండు వికలాంగుల, ఎనిమిది గీత కార్మికుల, 11 వితంతు పెన్షన్లు ఉన్నాయి.


Sangareddy: హామీల అమలుకు రెండేళ్లే గడువు - ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన పింఛన్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.


Pebbair: 715 మందికి కొత్త చేయూత పెన్షన్లు అందజేత
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరులోని వల్లపు రెడ్డి అనసూయమ్మ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పెబ్బేరు మండల, మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా మంజూరైన 715 చేయూత పెన్షన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేశారు.


Metpally: జాతీయ మానవ హక్కుల సంస్థ ఉపాధ్యక్షుడిగా గోవర్ధన్
జగిత్యాల జిల్లా మెట్టుపల్లి కి చెందిన జర్నలిస్ట్ ఎం. గోవర్ధన్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లభించాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడిగా (నేషనల్ వైస్ ప్రెసిడెంట్) గోవర్ధన్‌ను నియమించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన కనబరిచిన చొరవ, సేవా దృక్పథాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు.