

Paralakhemundi: న్యాయస్థానంలో లొంగిపోయిన విద్యాభారతి పండా
పర్లకీముండి ఏసీఎఫ్‌ఓ సౌమ్య రంజన్ మృతి కేసులో భార్య బిద్యాభారతి పండా ఐదేళ్ల తర్వాత జిల్లా కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టులో ఊరట లభించకపోవడంతో పర్లకీముండి ఎస్డీజేఎం కోర్టులో సరెండర్ కాగా, జడ్జి గాయత్రి మిశ్రా బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసి ఆమెను విచారణ ఖైదీగా ఉపకారాగానికి తరలించారు.


Sakhinetipalli: సెల్‌ఫోన్ వెలుతురులోనే పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు!
కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో విద్యుత్ లేక అంధకారంలోనే సెల్‌ఫోన్ వెలుతురులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించడం విమర్శలకు దారితీసింది. కనీస మౌలిక వసతులు, జనరేటర్ బ్యాకప్ లేకుండా ఎన్నికలు జరపడంపై అసంతృప్తి వ్యక్తమవగా, పూర్తి ఎన్నికల నాటికి ఏర్పాట్లు సరిదిద్దాలని ప్రజలు కోరారు.


Kadiri: కదిరి రూరల్‌లో టీడీపీ ఎన్నికల ప్రచార జోరు.. యర్రదొడ్డిలో ఓట్ల వేట!
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండల పరిధిలోని యర్రదొడ్డి పంచాయతీలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థిని బృందావని విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తానని వినీత్ రెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు.


Madanapalle: మదనపల్లె 31వ వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం
మదనపల్లె మున్సిపాలిటీ 31వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గిరిజా సాయి శేఖర్ రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థిపై 221 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన గెలుపునకు సహకరించిన ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.


Padamatipalem: తుపాన్ బాధితులకు ఎన్నారై చిట్టిబాబు ఆర్థిక సాయం
కోనసీమ జిల్లా మలికిపురం మండలం పడమటిపాలెం రాజీవ్ నగర్‌లో అర్ణబ్, మురసు తుపాన్ల ధాటికి ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ఇజ్రాయెల్ ఎన్నారై తాడి చిట్టిబాబు 'పే బ్యాక్ టు ది సొసైటీ' కింద రూ. 50 వేల తక్షణ సాయం అందించారు. పూర్తిగా ఇల్లు కూలిన బాధితురాలికి రూ. 20 వేలు, మరో ముగ్గురికి పదివేల చొప్పున అందజేశారు.


Narayanpet: ఎండిన పంటలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక!
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిన పంటలను నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అప్పక్‌పల్లి, చిన్నజట్రం గ్రామాల్లో పరిశీలించారు. బోర్లలో నీరు లేక నష్టపోయిన రైతుల సమస్యలు తెలుసుకున్నారు. సంప్రదాయ వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.


Kothagudem: మురసు తుఫాన్: భద్రాద్రి జిల్లాలో విస్తారంగా వర్షాలు!
మురసు తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా అశ్వారావుపేటలో 65 మి.మీ., దమ్మపేట నాయుడుపేటలో 59 మి.మీ. వర్షం పడింది. వర్షాల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 22.1 డిగ్రీలకు పడిపోయాయి.


Mancherial: భూ సమస్యల పరిష్కారం వేగవంతం చేయాలి: లోకేష్ కుమార్!
భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా రీసర్వే, భూభారతి పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని సీసీఎల్ఏ లోకేష్ కుమార్ జిల్లాల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులు, జీవో 59, 76, 118 క్రమబద్ధీకరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రికార్డుల్లో పారదర్శకత పాటించాలని సూచించారు.


Madanapalle: మదనపల్లె 34వ వార్డులో టీడీపీ ఘన విజయం
మదనపల్లె మున్సిపాలిటీ 34వ వార్డు ఎన్నికల్లో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి బోయపాటి రంగస్వామి నాయుడు 727 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు, నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.


Nalgonda: నిరుద్యోగులకు SKSS ఉపాధి కల్పన అభినందనీయం: డీఎస్పీ!
నల్లగొండ ఎన్‌జీ కళాశాలలో ఎస్.కె.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన వచ్చింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ, యువత ఈజీ మనీకి ఆశపడకుండా కష్టపడి ఎదగాలని సూచించారు. ఫాక్స్‌కాన్, ఓరియంట్ వంటి బహుళజాతి కంపెనీలు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.


Nellore: నెల్లూరు కార్పొరేషన్‌లో కూటమి ప్రభంజనం
Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక విజయంతో గోమతినగర్ క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుటుంబ సమేతంగా డ్యాన్సులు చేసి సంబరాలు జరుపుకున్నారు.


Uppal: మెప్మా అదనపు సంచాలకుడు యాదగిరిరావు ఆస్తులు రూ.4.75 కోట్లు!
మెప్మా అదనపు సంచాలకుడు నల్లగుంట యాదగిరిరావు ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ 10 చోట్ల ఏకకాలంలో దాడులు చేసింది. ప్రభుత్వ విలువల ప్రకారమే రూ.4.75 కోట్ల విలువైన 12 ఓపెన్ ప్లాట్లు, విలాసవంతమైన ఇల్లు, కార్లు, 1.79 కిలోల బంగారం, 3 కిలోల వెండి గుర్తించారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.