జ్యోతిష్యం
Logo
1 / 50
Karthika Pournami Horoscope 2026: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే!

Karthika Pournami Horoscope 2026: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే!

24 Nov 2026 12:30 AM IST
This is an AI assisted summary.

కార్తీక పౌర్ణమి 2026 రాశిఫలాలు తెలుసుకోండి. శివకేశవుల అనుగ్రహంతో 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

మహబూబ్‌నగర్
Logo
2 / 50
Kollapur

Kollapur: ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాపై అవగాహన కార్యక్రమం

23 Nov 2026 11:40 PM IST
This is an AI assisted summary.

నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం, దేవుని తిరుమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా భీమా పరిహారం అందుతుందని నాయకులు వివరించారు.

కడప (వైఎస్సార్ కడప)
Logo
3 / 50
Proddatur

Proddatur: ప్రొద్దుటూరులో వైసీపీ మౌన ప్రదర్శన.. రాచమల్లు విమర్శలు

23 Nov 2026 11:23 PM IST
This is an AI assisted summary.

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజా విద్రోహ దినం’ పేరుతో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజల ప్రత్యక్ష ఓటుతో కాకుండా మున్సిపల్ చైర్మన్, 52 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగడాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తప్పుబట్టారు.

కడప (వైఎస్సార్ కడప)
Logo
4 / 50
Proddatur

Proddatur: ప్రొద్దుటూరు వైస్ చైర్మన్‌గా చల్లా రాజగోపాల్ యాదవ్

23 Nov 2026 11:21 PM IST
This is an AI assisted summary.

ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. జాయింట్ కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆయనకు ఎన్నిక ధ్రువపత్రాన్ని అందజేశారు. ​రాజగోపాల్ యాదవ్ ​తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో హామీలు ఇచ్చినా నెరవేరలేదని, వరదరాజుల రెడ్డి మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ​

కడప (వైఎస్సార్ కడప)
Logo
5 / 50
Proddatur

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్‌గా రాఘవరెడ్డి ప్రమాణ స్వీకారం

23 Nov 2026 11:18 PM IST
This is an AI assisted summary.

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో నూతన ప్రొద్దుటూరు పురపాలక సంఘం నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన 52 మంది కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ చైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైస్ చైర్మన్‌గా చల్లా రాజగోపాల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement
కరీంనగర్
Logo
6 / 50
Makthal

Makthal: భూముల రీ సర్వేతో రైతులకు శాశ్వత పరిష్కారం

23 Nov 2026 11:15 PM IST
This is an AI assisted summary.

భూముల రి సర్వే వల్ల రైతులకు సరైన న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. సోమవారం మక్తల్ మండలంలోని తిరుమలాపూర్ లో జరుగుతున్న భూముల రి సర్వేను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలో 120 మంది రైతులకు రీసర్వ్ చేశామని 450 ఎకరాలు రీసర్వే పూర్తి అయినది అని ఎమ్మార్వో తెలిపారు. ఎకరా కన్న తక్కువ ఉన్నవారు ఎంతమంది అని అడిగిన కలెక్టర్. సర్వేతో ఎంతో ఉపయోగం ఉన్నదని తెలిపారు.

సిద్దిపేట
Logo
7 / 50
Siddipet

Siddipet: సిద్దిపేట ప్రజావాణిలో 199 అర్జీలు.. త్వరగా పరిష్కరించాలి

23 Nov 2026 11:12 PM IST
This is an AI assisted summary.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

ఖమ్మం
Logo
8 / 50
Bhadrachalam

Bhadrachalam: పట్టభద్రులు నన్ను గెలిపించండి జనసేన అభ్యర్థి గడల శ్రీనివాస్

23 Nov 2026 11:09 PM IST
This is an AI assisted summary.

పట్టభద్రులంతా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని హరిత హోటల్లో జనసేన నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడుతూ పట్టభద్రులంతా జనసేనకు ఓటు వేసి గెలిపించేలా కార్యాచరణ చేపట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని అన్నారు.

మంచిర్యాల & ఆసిఫాబాద్
Logo
9 / 50
Mancherial

Mancherial: రూ. 5 లక్షల జీవిత బీమాతో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు

23 Nov 2026 11:07 PM IST
This is an AI assisted summary.

పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

కరీంనగర్
Logo
10 / 50
Karimnagar

Karimnagar: దీక్షా దివస్ సభను చారిత్రాత్మకంగా నిర్వహించాలి

23 Nov 2026 11:05 PM IST
This is an AI assisted summary.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
సిద్దిపేట
Logo
11 / 50
Siddipet

Siddipet: పదేళ్ల బీజేపీ వైఫల్యాలు చెప్పడానికి వస్తున్నారా?

23 Nov 2026 11:02 PM IST
This is an AI assisted summary.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదేళ్ల ఫైఫల్యాలు చెప్పడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డ ఈ నెల 25 సిద్దిపేట కు వస్తున్నార అని సిద్దిపేట మాజీ AMC, చైర్మన్ పాల సాయిరాం ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మాజీ మార్కెట్ చైర్మన్ సారయ్య, మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్, సంతోష్ రెడ్డి లతో కలసి విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో రూపాయి విలువ పడిపోయిందని అన్నారు.

వరంగల్
Logo
12 / 50
Jangaon

Jangaon: నవంబర్ 27న జనగామ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

23 Nov 2026 11:00 PM IST
This is an AI assisted summary.

ఈ నెల 27న ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనగామ మెడికల్ కాలేజీ భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.