

Palakonda: డిసెంబర్ 1 నుండి 3 వరకు జరగనున్న ఢిల్లీ ధర్నాను జయప్రదం చేయండి!
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీరామ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుండి 3 వరకు జరగనున్న ఢిల్లీ ముట్టడి పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్ రూ.21 వేలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.


Rajam: రాజాం 8, 16వ వార్డు బీజేపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!
రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేసింది. రాజాం 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా దాసరి అనసూయ, 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కోటగిరి మాధురికి పార్టీ అధిష్టానం బీ ఫారాలను అందజేసింది.


Life Insurance: ఒక్క రూపాయి కట్టక్కర్లేదు.. కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభిస్తోంది. కుటుంబంలో సంపాదించే 18 నుంచి 59 ఏళ్ల వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తారు.


Giddalur: ధరల నియంత్రణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ముత్తుముల!
మార్కాపురం జిల్లా గిద్దలూరు రాచర్ల రోడ్డు, కొమరోలు బస్ స్టాండ్ వద్ద సబ్సిడీ సన్నబియ్యం విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఆధార్ కార్డుపై బీపీటీ రకం కిలో రూ.49, కేఎన్ఎం/ఆర్ఎన్ఆర్ రకం కిలో రూ.50 చొప్పున 26 కిలోల బ్యాగులు అందిస్తున్నట్లు తెలిపారు.


Konaseema: ఆర్టీసీ బస్సు ఎక్కుతూ జారిపడి వృద్ధుడు మృతి!
Konaseema: యర్రపోతవరం వంతెన వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా జారిపడి చక్రం కింద పడి అద్దంపల్లి వాసి వాసా సత్యనారాయణ (70) మృతి చెందారు.


Eluru: ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. పలు గ్రామాల్లో హై అలర్ట్!
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలోని తేలకలమ్మ గట్టుపై బుధవారం తెల్లవారుజామున పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిత్తపూరు, కొండపర్వ పరిసర గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించి, పులిని సురక్షితంగా బంధించేందుకు స్పెషల్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.


Chirala: దేవాంగపురి టీడీపీ సర్పంచి అభ్యర్థిగా పృద్వి ఉదయ్ కుమారి ఖరారు!
చీరాల మండలం దేవాంగపురి గ్రామ సర్పంచి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పృద్వి లలిత మోహన్ గారి భార్య శ్రీమతి పృద్వి ఉదయ్ కుమారి ను, ఖరారు చేస్తూ చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నిర్ణయం తీసుకున్నారు. అతని అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే ఆమోదం తెలిపారు.


Puttaparthi: పుట్టపర్తి వేడుకల్లో పాల్గొన్న రష్మిక.. మహిళా శక్తిపై కీలక వ్యాఖ్యలు!
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి బాబా 101వ జయంతి వేడుకలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రష్మిక మందాన పాల్గొని ప్రసంగించారు.


Arunachala Girivalam: కార్తీక పౌర్ణమి రోజున తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణలో ఇలా జరిగిందా... మీ అదృష్టం పండినట్టే
కార్తీక పౌర్ణమి రోజున తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణలో కాలికి అనుకోకుండా గాయమైతే అపిత కుచమాంబ అమ్మవారు కట్టు కడతారనే విశేష భక్తి విశ్వాసం గురించి తెలుసుకుందాం రండి.


Chityal: కల్లు దొంగలకు తాత మాస్టర్ ప్లాన్.. డబ్బాకు గొలుసు, తాళం!
Chityal: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిత్యం కల్లు దొంగతనాలు జరుగుతుండటంతో ఓ తాత రూ.500 ఖర్చు చేసి కల్లు డబ్బాకు గొలుసు, తాళం ఏర్పాటు చేశారు.


Asifabad: బారేగుడలో ఘనంగా అయ్యప్ప స్వాముల మెట్ల మడిపూజ!
చింతలమానేపల్లి బెజ్జూర్ కౌటాల తదితర మండలాలలో అయ్యప్ప స్వామి మండల మాలధారణ తీసుకున్న స్వాములు భక్తి శ్రద్ధలతో మడి పూజలు నిర్వహిస్తున్నారు. చింతలమానేపల్లి మండలం బారేగుడలో అయ్యప్ప స్వాముల మెట్ల మడిపూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.


Nalgonda: చిట్యాల సమీపంలో ఆటో-లారీ ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు!
Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాల శివారులోని ఐడీఎల్ కంపెనీ సమీపంలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.