

Bejjur: బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో జ్యోతిబా ఫూలే వర్ధంతి ర్యాలీ!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే 136వ వర్ధంతి వేడుకలను మాలి సంఘం మండల అధ్యక్షులు ఆదే అశోక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చింతలమానేపల్లి మండలంలోని ధరంపల్లి డబ్బా బారేగుడ గ్రామాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.


Makthal: మక్తల్‌లో వాకిటి లలిత ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కార్తీక మాస పవిత్రతను చాటుతూ మంత్రి వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలిత గారి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయ కోనేరులో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.


AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలు నేడే.. దూకుడు మీద ఉన్న వైసీపీ!
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. పల్లె పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు సర్వశక్తులూ ఒడ్డడంతో రెండో విడత పంచాయతీ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. విశాఖపట్నం మినహా రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో ఉన్న 246 మండలాల్లోని 3,880 గ్రామ పంచాయతీల్లో ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ సందడి మొదలైంది.


Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి
జార్ఖండ్‌లోని రాంచీ పాట్నా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బీహార్ నుంచి రాజరప్ప ఆలయానికి వెళ్తున్న భక్తుల స్కార్పియో కారు ప్రమాదానికి గురైంది.


Sunday Horoscope: ఆదివారం ఈ రాశులకు మహాయోగం... సూర్యభగవానుడి అనుగ్రహంతో దీర్ఘాయుష్షును పొందే రాశులు ఇవే
సూర్యభగవానుడి అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి మహాయోగం కలగనుంది. ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో 12 రాశుల వారి ఫలితాలు, సూర్యారాధన విశేషాల గురించి తెలుసుకుందాం.


Khammam: నవంబర్ 29 దీక్షా దివస్‌కు తరలిరండి పువ్వాడ అజయ్
స్వరాష్ట్ర సాధన కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే అచంచల సంకల్పానికి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రతీకగా నిలిచిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాధన లక్ష్యంతో ఉద్యమ దళపతి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాగ్నిగా మారిన రోజు(నవంబర్ 29) దీక్షా దివస్ అని పేర్కొన్నారు.


Khammam: ఖమ్మంలో ఆర్యవైశ్యుల వనభోజనాలను విజయవంతం చేయండి
ఖమ్మం నగరంలో ఆదివారం చెరుకూరి మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం , వాసవి కన్యకా పరమేశ్వరి అన్నసత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆర్యవైశ్యుల వనసమారాధన (వనభోజనాల) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.


Aswapuram: ఇంటర్ వ్యవస్థ రద్దు ఆలోచన విరమించుకోవాలి
అశ్వాపురం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే దిశగా ఆలోచనలు చేయడం విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించే చర్య అని AISF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. అశ్వాపురం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి AISF జిల్లా సహాయ కార్యదర్శి ఇనపల్లి పవన్ సాయి అధ్యక్షత వహించారు.


Karimnagar: కరీంనగర్లో శాతవాహన వర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికలు
తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో శాతవాహన అంతర్ విశ్వవిద్యాలయ టీం సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికల పోటీలను నిర్వహించారు. ఈ ఎంపికలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాజస్థాన్‌లో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయ సాఫ్ట్‌బాల్ పోటీలలో శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.


Aswapuram: అశ్వాపురంలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి చెట్టి సురేష్ నివాళి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా మాల సంఘాల జేఏసీ పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు చెట్టి సురేష్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.


Manuguru: మణుగూరులో రూ.14.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మణుగూరు మండలానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు రూ.14 లక్షల 70 వేల రూపాయల విలువైన చెక్కులను పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు, ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.


Manuguru: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి
మణుగూరు మండలం గుట్టమల్లారం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగిలో సాగునీటి కొరత దృష్ట్యా వరికి బదులుగా పెసర, మినుము, జొన్న, కంది, నువ్వులు, వేరుశనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. పంటల సాగు విధానాలు, విత్తన ఎంపిక, ఎరువుల యాజమాన్యం, సోలార్ ఫెన్సింగ్, ఫామ్ పాండ్స్ నిర్మాణం, వ్యవసాయ యంత్రాల సబ్సిడీపై అవగాహన కల్పించారు.