

Toopran: రావెల్లిలో ఘనంగా సదర్ వేడుకలు.. పాల్గొన్న మహేష్ యాదవ్
తూప్రాన్ మున్సిపాలిటీలోని రావెల్లిలో ఆదివారం రాత్రి నిర్వహించిన యాదవుల సదర్ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లబోయిన మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన యాదవ సోదరులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొన్నారు. యాదవుల సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటిచెప్పేలా సదర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.


Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంకు నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా నలుగురు ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ తెలిపారు.


Mohammadabad: ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన.. సబ్సిడీ విత్తనాలు
మొహమ్మద బాద్ (కామారెడ్డి ) ప్రస్తుత యాసంగి పరిస్థితి లో అన్నదాతలు అరుతడి పంట సాగు పై ఆసక్తి చూపాలని సోమవారం ఇంచార్జి మండల వ్యవసాయ శాఖ అధికారి రాజు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామ పంచాయతీ సమావేశ హల్ లో గ్రామ సర్పంచ్ సూర్నర్ శకుంతల ప్రజ్ఞేష్ కుమార్ (బాలు సార్ ) అధ్యక్షతన గ్రామ రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.


Sircilla: మహా పాదయాత్ర విజయం.. సిరిసిల్ల బీజేపీ నేతల కృతజ్ఞతలు
కరీంనగర్లో నిర్వహించిన మహా పాదయాత్రను విజయవంతం చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


Nagarkurnool: మద్దిమడుగులో మంత్రి లక్ష్మణ్ పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు అబ్బతి ఆంజనేయ స్వామినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు,26వ తేదీ సంత్ సేవలల్ విగ్రహానికి భూమి పూజ చేయడానికి అదేవిధంగా మాధ్యమడుగు ఆంజనేయస్వామి దేవాలయానికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వస్తుండటంతో అక్కడి స్థలాని పరిశీలించారు, ఎలిపాడ్ పనులను పర్యవేక్షణ చేశారు.


Nirmal: నిర్మల్ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం.. వివరాలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది బేటి బచావో బేటి పడావో పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


Tiruvuru: తిరువూరు అభివృద్ధికి కూటమి ఐక్యత బలం
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తిరువూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలుత తిరువూరులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సదుపాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


Madanapalle: మదనపల్లె 28వ వార్డు అభివృద్ధికి కృషి రామకృష్ణ చారి
మదనపల్లె మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్‌గా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ చారి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పచ్చిపాల తులసి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.


Gudur: గూడూరులో 1600 స్మార్ట్ ఎల్ఈడీ దీపాలు.. సెన్సార్ సాంకేతికత
కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో నూతన సాంకేతికతతో కూడిన 1600 స్మార్ట్ ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు. EESL ఆధ్వర్యంలో ILM Device (1642) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వీధి దీపాలను అమర్చనున్నారు.


Karimnagar: మహా పాదయాత్ర సక్సెస్.. బండి సంజయ్‌ను అభినందించిన బీజేపీ చీఫ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన ‘మహా పాదయాత్ర’ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సంతోషం వ్యక్తం చేశారు. మహా పాదయాత్ర అనంతరం కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ కు వెళ్లి కాసేపు సేద తీరిన నితిన్ నబిన్ సాయంత్రం 4.45 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు.


Sircilla: అక్రమ పెన్షన్లు, ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు.. విచారణ కోరిన నేత
ఒకే కుటుంబానికి చెందిన గాజుల బాలయ్య, ఆయన భార్య సరోజన, కోడలు సామాజిక పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా, మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన బాలయ్యకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. అర్హులైన పేదలకు అందాల్సిన పథకాలు అనర్హులకు చేరుతున్నాయని పేర్కొన్నారు.


Mancherial: మంచిర్యాల ప్రజావాణికి 63 అర్జీలు.. త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హుల సమస్యలను త్వరగా పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.