

Vikarabad: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుపై కలెక్టర్ సమీక్ష
జిల్లా లో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా యోజన పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారము కలెక్టర్ అధ్యక్షతన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


Siddipet: సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం
ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో సభ ప్రాంగణాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సిద్దిపేట బైపాస్ రోడ్డులోని నాగదేవత ఆలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.


Patancheru: గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 29 లక్షల పరిహారం
పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. యజమాన్యంతో చర్చించి నష్ట పరిహారం అందించి కుటుంబానికి ఆర్థిక భరోసా అందించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జి. దానయ్య.. గత కొంతకాలంగా పాశమైలారం పారిశ్రామికవాడలోని ల్యాం టఫ్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ.. కుటుంబంతో కలిసి స్థానికంగా జీవనం కొనసాగిస్తున్నారు.


Hyderabad: కొండగట్టు ఆంజనేయ స్వామి చందనోత్సవానికి గవర్నర్ ఆహ్వానం
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించనున్న చందనోత్సవం, మహా సంప్రోక్షణ మరియు నిజరూప దర్శన మహోత్సవాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను మంగళవారం ఆహ్వానించారు.


Warangal: కేటీఆర్ సభను విజయవంతం చేయాలి నన్నపునేని నరేందర్
ఈ నెల 22వ తేదీన హన్మకొండ లో నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా, వారికి ఘన స్వాగతం పలికేందుకు వారి నివాసంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రేటర్ వరంగల్ తొలి మేయర్ మరియు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.


Warangal: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
అర్హత కలిగిన ప్రతి ఓటరు తుది జాబితాలో ఉండే విధంగా, ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్.ఐ.ఆర్ రోల్ అబ్జర్వర్ హరిచందన సంబధిత అధికారులను ఆదేశించారు.


Thimmapur: లబ్ధిదారులకు కొత్త పింఛన్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతోందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని వెల్లడించారు.


Warangal: కొత్త పింఛన్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కొండా సురేఖ
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేదలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.


Warangal: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలులో పొరపాట్లకు తావివ్వొద్దు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.


Sircilla: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డి, రాంరెడ్డి విమర్శించారు. ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.


Warangal: ఎంజీఎం ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం
సేవా కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లోని MGM ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన ఆధ్వర్యంలో అధ్యక్షుడు లయన్ సింగారం శ్రీకర్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులు, నిరుపేదలకు భోజనం అందించి సేవాభావాన్ని చాటుకున్నారు.


Vemsoor: లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేసిన మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కష్టాన్ని తీర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి వేంసూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్ ఆవరణలో జరిగిన నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.