

Karimnagar: వేలిముద్రలపై కారం చల్లిన దొంగ.. పట్టుకున్న పోలీసు!
వేలిముద్రలు దొరక్కుండా ఇంట్లో కారం పొడి చల్లి చోరీలకు పాల్పడుతున్న సుల్తానాబాద్‌కు చెందిన బాలసాని అజయ్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు నాట్ గ్రిడ్ యాప్ ఆధారంగా అరెస్ట్ చేశారు. బొమ్మకల్, తెలకపల్లితో పాటు గతంలో ఊటూరు బ్యాంకు దోపిడీ కేసుల్లోనూ నిందితుడైన ఇతన్ని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.


Nellore: రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి
Nellore: నెల్లూరు కలెక్టరేట్లో అగ్రిస్టాక్ కార్యక్రమంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ సమీక్ష. రైతులకు మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలపై ఆదేశాలు.


Karimnagar: మెడికల్ కాలేజీ పనులు మరింత వేగవంతం: కలెక్టర్ చిత్రా మిశ్రా!
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. డీఎంఈ రమాదేవి, ప్రిన్సిపాల్ తఖియుద్దీన్ ఖాన్‌లతో కలెక్టరేట్లో సమీక్షించిన కలెక్టర్, వైద్య విద్యార్థులకు హాస్టల్, కాలేజీలో అన్ని వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.


Nellore: ఎన్నికల వ్యయ వివరాలు పక్కాగా నమోదు చేయాలి
Nellore: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ వివరాలను పక్కాగా నిర్వహించాలని పరిశీలకులు వి. సాయిబాబు ఆదేశం. జెడ్పీ సీఈఓతో సమీక్షా సమావేశం.


రెస్ట్‌లెస్ సీఎం.. చంద్రబాబు.. అర్నబ్ తుఫానుపై రేయింబవళ్లు పర్యవేక్షణ.. మూడు రోజుల్లో 10 సమీక్షలు
Amaravati: అర్నాబ్ తుపాను ముప్పు వేళ సీఎం చంద్రబాబు నాయుడు 3 రోజుల్లో 10 సమీక్షలు నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డేటా, టెక్నాలజీ ఆధారంగా సహాయక చర్యలు.


Karimnagar: రీంనగర్‌లో అంకురార్పణతో మొదలైన వరాహ బ్రహ్మోత్సవాలు!
కరీంనగర్ సర్వవైదిక సంస్థానం శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. సేనాధిపతి ఉత్సవంతో పాటు మృత్సంగ్రహణం, తొమ్మిది పాలికల్లో నవధాన్యాల పూజతో అంకురార్పణ, ధ్వజపట శయనాధివాసం నిర్వహించారు. స్వప్న కుమారి బృందం నృత్య ప్రదర్శనలు అలరించాయి.


Nellore: వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార హోరు!
Nellore: నెల్లూరు ముంగమూరివారి వీధి, సరస్వతినగర్‌లో వైఎస్సార్సీపీ ప్రచారం. మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, 17వ డివిజన్ అభ్యర్థి వెంకటేశ్వర్లు గెలుపుకు విజ్ఞప్తి.


Nellore: 27వ డివిజన్లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ప్రచార దూకుడు!
Nellore: నెల్లూరు రూరల్ 27వ డివిజన్ టీడీపీ అభ్యర్థి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ప్రచార దూకుడు. గతంలో చేపట్టిన వందల కోట్ల అభివృద్ధితో ప్రచారంలో జోరు.


Indukurupeta: వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడిగా బందెల వెంకటరమణ!
Indukurupeta: ఇందుకూరుపేట మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా బందెల వెంకటరమణ నియామకం. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన అధ్యక్షుడు.


Nellore: రైతు బజార్లలో అందుబాటు ధరలకే బియ్యం విక్రయాలు
Nellore: నెల్లూరు జిల్లా రైతు బజార్లలో అందుబాటు ధరలకే బియ్యం విక్రయాలు. బీపీటీ కిలో ₹49, కేఎన్ఎం ₹50కి లభ్యమని తెలిపిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు.


Narsapur: నర్సాపూర్‌లో ఎల్‌నినో ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్!
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. నర్సాపూర్ రైతు వేదిక నుంచి ఎంపీడీవో భారతి, అధికారులు హాజరయ్యారు. తాగునీటి కొరత రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలను ఆదుకోవాలని మంత్రి సూచించారు.


Nellore: బుజబుజనెల్లూరులో కూటమి అభ్యర్థుల ప్రచార ర్యాలీ హోరు!
Nellore: నెల్లూరు 34వ డివిజన్ బుజబుజనెల్లూరులో కూటమి ప్రచార ర్యాలీ. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి చాముండేశ్వరి గెలుపుకు గిరిధర్ రెడ్డి విజ్ఞప్తి.