

Banswada: బాన్సువాడలో నాటుబాంబు పేలుడు: వ్యక్తి మృతి
బాన్సువాడ మండలం తాడుకోలు రాజారాం దుబ్బ కాలనీలో అడవి పందుల వేటకు నాటుబాంబులు తయారు చేస్తుండగా నవంబర్ 1న జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడిన కడమంచి రమేష్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, నాటుబాంబుల తయారీ చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.


Bichkunda: అతిథి అధ్యాపకులకు పూర్తి పారితోషికం ఇవ్వాలి
బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్‌కు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ వినతిపత్రం అందజేసింది. దసరా, సంక్రాంతి వంటి ప్రభుత్వ సెలవులను మినహాయించకుండా నెలకు పూర్తి కన్సాలిడేటెడ్ పారితోషికం ఇవ్వాలని అధ్యక్షుడు గౌసోద్దీన్, ప్రశాంత్ రెడ్డి కోరారు. ఉన్నత విద్యా మండలికి సానుకూల సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.


Sathupalli: సత్తుపల్లిలో 12 అడుగుల భారీ కొండచిలువ పట్టివేత
సత్తుపల్లి కృషి బైపాస్ రోడ్డులోని ముళ్ల తీగల ఫ్యాక్టరీ సమీపంలో 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రాత్రివేళ ప్రత్యేక చర్యలు చేపట్టి కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.


Sathupalli: సత్తుపల్లిలో పనికి ఆహార పథకం మేట్లకు శిక్షణ
సత్తుపల్లి మండలంలో పనికి ఆహార పథకం మేట్లకు ఎంపీడీవో, కల్లూరు క్లస్టర్ ఏపీడీ చలపతి ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. కూలీలకు రోజుకు రూ.308 వేతనం వచ్చేలా కొలతల ప్రకారం పనులు చేయించాలని, ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో హాజరు పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఏపీవో నరసింహారావు, ఈసీ శ్రీను, టీఏలు, మేట్లు పాల్గొన్నారు.


Achampet: ఈనెల 22న అచ్చంపేటలో గద్దరన్న విగ్రహావిష్కరణ
ఈనెల 22న అచ్చంపేటలో ప్రజా యుద్ధనౌక గద్దరన్న విగ్రహాన్ని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఉప్పునుంతల అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహ కమిటీ, ప్రజాసంఘాల నేతలు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.


Charlapally: పేదలకు రేషన్ కిట్ల పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి: చర్లపల్లి లో సమాజ సేవే లక్ష్యంగా ముకుల్ మాధవ్ ఫౌండేషన్ (MMF), ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో చర్లపల్లిలో నిర్వహించిన భారీ ఉచిత రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


Bichkunda: ఎఫ్‌పీజీ, ఎఫ్‌పీసీల ఏర్పాటుపై రైతులకు అవగాహన
కామారెడ్డి జిల్లా బిచ్కుంద రైతు వేదికలో శ్రీ రాజరాజేశ్వర రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఎఫ్‌పీజీ, ఎఫ్‌పీసీల ఏర్పాటుపై సదస్సు జరిగింది. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పెద్ద కొడపగల్ రైతులు ఐక్యంగా ఏర్పడితేనే పెట్టుబడులు తగ్గి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని సెర్ప్ డీపీఎం సురేష్ కుమార్, రవీందర్ రావు పేర్కొన్నారు.


Sircilla: ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా అనురాధ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నవంబర్ 6న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజ గంగారెడ్డి, ఎన్నికల పర్యవేక్షణ అధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.


Cherlapally: చర్లపల్లి ఓపెన్ జైల్ సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్
చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం ఓపెన్ జైలు సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన భరత్ రెడ్డి హెడ్ ఆఫీస్‌కు బదిలీ కాగా, నిజామాబాద్ సెంట్రల్ జైల్ నుంచి అశోక్ కుమార్ వచ్చారు. గతంలో జైలర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న అశోక్ కుమార్, ఖైదీల సంక్షేమం, జైలు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.


Devarakonda: మహిళా రైతుల కష్టాలపై కవిత స్పందన
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదిక వద్ద శనివారం ఉదయం నుంచి వేరుశనగ విత్తనాల కోసం అవస్థలు పడుతున్న మహిళా రైతుల ఇబ్బందులను చూసి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చలించిపోయారు.


Nagarkurnool: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. విద్యా వ్యవస్థలోని ఈ అసమానతలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


Markapuram: పొదిలి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు ఘన విజయం!
మార్కాపురం జిల్లా పొదిలి జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ముద్దుల శ్రీనివాసులు 13,481 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచే భారీ ఆధిక్యాన్ని కనబరిచిన ఆయన రికార్డు విజయం నమోదు చేయడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.