

Sambepalli: రిటైర్డ్ ఎస్ఈ వీరనాగన్న మృతి పట్ల మంత్రి మండిపల్లి సంతాపం!
సంబేపల్లి మండలం కొండావండ్లపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్ఈ వీరనాగన్న మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.


Ichchapuram: ప్రశాంత ఎన్నికలకు అభ్యర్థులంతా సహకరించాలి: పలాస డీఎస్పీ
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులతో పలాస–కాశీబుగ్గ రేంజ్ డీఎస్పీ జి.వి.రమణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రశాంత ఎన్నికలకు అభ్యర్థులు సహకరించాలని, కౌంటింగ్ తర్వాత గెలుపు సంబరాలు, ర్యాలీలు, బాణాసంచాకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.


Bellampalli: నకిలీ డెత్ సర్టిఫికెట్ల స్కాంలో తమ ప్రమేయం లేదు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, బూదాకుర్డ్ కారోబార్ చిలుముల రవి తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, కాంగ్రెస్ నాయకుడు వెంబడి సురేష్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీడీఓ మహేందర్ అని వారు ఆరోపించారు.


Password: ఈజీగా ఉందని '123456' పాస్‌వర్డ్ పెట్టుకున్నారా? అయితే ఇది తెలిస్తే జన్మలో పెట్టుకోరు!
Password: సైబర్ దాడులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది యూజర్లు ఇంకా బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2026లోనూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న పాస్‌వర్డ్‌గా '123456' నిలిచినట్లు సమాచారం. సులభంగా గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇలాంటి సాధారణ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం వల్ల ఖాతాల భద్రత ప్రమాదంలో పడుతోంది.


Amangal: ఆమనగల్ కట్టమైసమ్మ ఆలయానికి సప్పిడి కుటుంబం త్రిశూలం సమర్పణ
ఆమనగల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో త్రిశూలం సమర్పించారు. తుక్కుగూడకు చెందిన అమ్మవారి భక్తులు సప్పిడి లక్ష్మీదేవి–నరసింహ కుటుంబ సభ్యులు, వారి కుమారుడు సప్పిడి సారిక సందీప్, సప్పిడి శివాని కలిసి భక్తితో త్రిశూలాన్ని అమ్మవారికి సమర్పించారు.


India China Border: చైనా బోర్డర్‌లో టెన్షన్.. భారత్ కీలక చర్చలు..
India China Border: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంట నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు, క్షేత్రస్థాయిలో సైనికుల మధ్య ఘర్షణలు జరగకుండా చూసేందుకు భారత్, చైనా మరోసారి ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. కఠినమైన చలికాలం మొదలయ్యే ముందే పరిస్థితులను చక్కదిద్దడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.


Parkal: పోలియో రహిత సమాజానికి అందరూ కృషి చేయాలి
ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను ఆయన అభినందించారు.


Gannavaram: గన్నవరం మండలం గోపవరపుగూడెంలో నల్లూరి శశికళ విస్తృత ప్రచారం!
గన్నవరం మండలం గోపవరపుగూడెం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నల్లూరి శశికళ, రాష్ట్ర బీసీ కార్యదర్శి కొలుసు మోహన్ యాదవ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహకారంతో పోటీ చేస్తున్నామని, కత్తెర గుర్తుపై ఓటు వేసి తమ ప్యానల్‌ను గెలిపించాలని మాజీ సర్పంచ్ నల్లూరి వెంకటేశ్వరరావు కోరారు.


Chevella: చేవెళ్లలో పెరిగిన చలి తీవ్రత.. దట్టమైన పొగమంచుతో ఇబ్బందులు
చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన ప్రజలకు ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో కొనసాగిన అధిక ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Nirmal: ఈ నెల 25 నుంచి ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రారంభం
నిర్మల్ జిల్లా బాధితులు తమకు కేటాయించిన తేదీల్లో మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ధృవీకరణ కేంద్రానికి హాజరుకావాలి : జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ఆధ్వర్యంలో అసలు ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ మరియు నమోదు ప్రక్రియ చేపట్టింది.


Pedda Dornala: పెద్ద దోర్నాలలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి భారీ ర్యాలీతో నామినేషన్!
పెద్ద దోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గుమ్మ ఎల్లయ్య ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, బాణాసంచా, డప్పు వాయిద్యాల నడుమ స్వర్ణ గ్రామం 1 కేంద్రంలో పత్రాలు సమర్పించారు.


Karimnagar: రేపు కరీంనగర్‌కు నితిన్ నబీన్.. చరిత్ర సృష్టించేలా పాదయాత్ర
రేపు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కరీంనగర్ వస్తున్నారు. సర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలపట్ల విబేధాలు స్రుష్టిస్తోంది. దీనిని తిప్పికొట్టేందుకు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు బీజేపీ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్ల మహా పాదయాత్ర పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ లో మహా పాదయాత్ర చేయాలని నిర్ణయింది.