

Miryalaguda: మిర్యాలగూడలో మంత్రుల పర్యటన పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం
మిర్యాలగూడ: ఈనెల 6 న మిర్యాలగూడ లోని తుంగ పహాడ్ వద్ద నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కు రాష్ట్ర మంత్రులు రానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.


Guntur: బ్యాలెట్ బాక్సులు మారుస్తున్నారంటూ నల్లపాడు రోడ్డుపై ధర్నా!
వెంగళాయపాలెం బూత్ సిబ్బందిని అడ్డుకున్న వైసీపీ నేతలు. బ్యాలెట్ బాక్సులతో బస్సు ఎక్కుతుండగా అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు. బ్యాలెట్ బాక్సులు మారుస్తున్నారంటూ నల్లపాడు రహదారి వద్ద ధర్నా. పోలీసులు సర్దిచెప్పినా వెనక్కి తగ్గని వైసీపీ నాయకులు.


Badvel: ఎమ్మెల్సీ కుమారుడు ఆదిత్య రెడ్డి అరెస్ట్.. రోడ్డెక్కిన వైసీపీ!
గోపవరం మండలం ఎస్.రామాపురంలో బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోశారన్న ఫిర్యాదుతో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి, నరసారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టును నిరసిస్తూ బద్వేల్ రూరల్ పీఎస్ ఎదుట ఎమ్మెల్యే డాక్టర్ సుధ బైఠాయించి నిరసన తెలిపారు. బద్వేలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


Kagaznagar: లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఉచిత వైద్య సేవలు ప్రశంసనీయం
కాగజ్ నగర్: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఈరోజు 21 రోజుల పాటు వైద్య సేవలు అందించిన లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ వైద్య సేవల ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.


Mahbubnagar: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం
మహబూబ్‌నగర్: శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానిస్తూ దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఈవో, అర్చకుల బృందం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కి అందజేశారు.


Kothagudem: కొత్తగూడెం అదనపు జిల్లా జడ్జిగా డి. రాంప్రసాదరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి. రాంప్రసాదరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బి. రవికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎస్. సరిత హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఈ నియామకాలు అమల్లోకి వచ్చాయి.


Nellore: కోవూరులో ప్రశాంతంగా స్థానిక సంస్థల పోలింగ్ పూర్తి!
కోవూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీ వర్షంలోనూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాంతినగర్, పడుగుపాడు, నార్త్ రాజుపాళెం, రామతీర్థం తదితర గ్రామాల పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పోలింగ్ సరళిని, భద్రతా ఏర్పాట్లను నిశితంగా సమీక్షించారు.


Koheda: ఉపాధ్యాయుల కొరతపై శనిగరం హైస్కూల్ విద్యార్థుల ధర్నా
కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలోని జడిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఎదుట పదో తరగతి విద్యార్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేక చదువులు సక్రమంగా సాగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతిలో మొత్తం 74 మంది విద్యార్థులు ఉండగా, గణితం బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని తెలిపారు.


Nellore: వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని కలిసిన మేయర్ రూప్ కుమార్!
నెల్లూరు నగర మేయర్‌గా ఎన్నికైన రూప్ కుమార్ యాదవ్ నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయభాస్కర్ రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రూప్ కుమార్‌ను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.


Adilabad: జిల్లాలో 'అగ్రిస్టాక్' పకడ్బందీ అమలుకు కలెక్టర్ ఆదేశం!
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పారదర్శక అమలుకు ఉద్దేశించిన ‘అగ్రిస్టాక్’ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. డిజిటల్ క్రాప్ సర్వే, భూ రికార్డుల అనుసంధానం వేగవంతం చేసి రైతులకు డిజిటల్ ఐడీలు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలని స్పష్టం చేశారు.


Banswada: బాన్సువాడలో అక్రమ గ్యాస్ సిలిండర్ల గోదాముపై దాడులు
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లోని రాజారాం దుబ్బాలో ఒక రేకుల గోదాoలో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలెండర్లూ,75 లను సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకుని,అట్టి సిలెండర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Sircilla: పుట్టినరోజు వేడుకల్లో సేవాభావం.. రోగులకు పండ్ల పంపిణీ
రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, గంభీరావుపేట ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానంతో తెలంగాణ రక్షణ సేన ఇన్‌చార్జి మజీద్ పుట్టినరోజు వేడుకలను శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తోటివారికి సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మజీద్ తెలిపారు.