

Viral Video: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళపై వేధింపులు.. చెంప చెళ్లుమనిపించడంతో పరార్!
ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు భద్రత లేకుండా పోతోందనే ఆందోళన కలిగించే ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఆసుపత్రి వార్డులో రోగికి సహాయకురాలిగా వచ్చిన ఓ మహిళ నేలపై నిద్రిస్తుండగా, ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు.


Peddapalli: పెద్దపల్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.. కనీస వేతనం డిమాండ్
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వామపక్ష నాయకులు తాండ్ర సదానందం కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు.


Khammam: తిరుమలాయపాలెం పీఎస్ ఆకస్మిక తనిఖీ.. సీపీ సునీల్ దత్ ఆదేశాలు
ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.


Penumantra: కొయ్యేటిపాడు సర్పంచ్ బరిలో మల్లిపూడి జ్యోతి ప్రచారం ప్రారంభం
పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామ సర్పంచ్ గా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బలపరిచిన అభ్యర్థి మల్లిపూడి జ్యోతి గ్రామ సర్పంచ్ నిలిచారు. దీంతో గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు.గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని తాను సర్పంచ్ గా గెలుపొందక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.నిరంతరం గ్రామ అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు.


Bapatla: బాపట్ల 25వ వార్డులో ఎంపీ కృష్ణ ప్రసాద్, ఇస్కా సునీల్ ప్రచారం
అభివృద్ధి,సంక్షేమం కూటమితోనే సాధ్యమని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 25 వ వార్డు నందు బాపట్ల మున్సిపల్ కూటమి చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ తరఫున ఎంపీ కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత కలసి ప్రచారం నిర్వహించారు. వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆదుకోవాలని కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.


Tangellamudi: తంగెళ్లమూడి, బీడీ కాలనీలో బాలల భద్రతపై అవగాహన సదస్సు
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 'సమాజంలో సురక్షితమైన రేపటి కోసం నేటి అవగాహన' కార్యక్రమంలో భాగంగా శనివారం తంగెళ్లమూడిలోని సూర్య పబ్లిక్ స్కూల్,బీడీ కాలనీలోని సెయింట్ ఆంథోనీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్యానల్ లాయర్ పి.వెంకటేశ్వరరావు,సోషల్ వర్కర్ వై.యామిని శ్రీలత మానవ అక్రమ రవాణా,పోక్సో చట్టం,సురక్షిత స్పర్శ, బాలల భద్రతపై అవగాహన కల్పించారు.


Visakhapatnam: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి గంటా శ్రీనివాసరావు
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి స్కూల్ యాజమాన్యాలు కృషి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ గ్రీన్ డేల్ స్కూల్లో శనివారం జరిగిన స్టూడెంట్ ఎల్.ఈ.డి. కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే పాఠ్యాంశాలతో పాటు సామాజిక బాధ్యత, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.


Eluru: ఏలూరులో రోడ్డు భద్రత సమీక్ష.. రహ్-వీర్‌పై కలెక్టర్ వివరణ
ఏలూరు జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతివేగం, హెల్మెట్,సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు,మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.


Eluru: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంబంధిత శాఖల మంత్రులు,ప్రభుత్వ కార్యదర్సులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో శనివారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.


Penumantra: ఆలమూరు-ఓడూరు రోడ్డుపై దట్టంగా పొగ.. వాహనదారుల ఇబ్బందులు
పెనుమంట్ర మండలం ఆలమూరు ఓడూరు వెళ్లే రహదారి పక్కన పంచాయతీ సిబ్బంది చెత్తకు నిప్పు పెట్టడంతో రహదారిపై దట్టంగా పొగ కమ్మేసింది.దీంతో రహదారిపై ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పక్కన చెత్తకు నిప్పు పెట్టే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలని వాహనదారులు వాపోయారు.


Achanta: ఆచంట సర్పంచ్ బరిలో ఏడుగురు.. గుర్తులతో ముమ్మర ప్రచారం
రసవత్తరంగా సాగుతున్న ఆచంట సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు నిలిచారు. వీరిలో ఈదర రాము, తమ్మినీడి పృథ్వీ కుమార్, నెక్కంటి రాఘవేంద్ర,పెచ్చేటి సత్యనారాయణలు వ్యవసాయదారులు కాగా, అడ్డాల నాగభోగిరాజు, యళ్ల బాలాజీ తాపిమేస్తి వృత్తుల్లో ఉండగా, కొడిదల సత్యనారాయణ వ్యాపారంగా ఎన్నికల అఫిడవిడ్ లో నమోదు చేశారు.


Penumantra: నత్త రామేశ్వరం సర్పంచ్‌గా కరుణాకర్ వడయర్ ఏకగ్రీవ ఎన్నిక
పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక శనివారం ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థులుగా కరుణాకర్ వడయర్ మరియు సిహెచ్.వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు.సిహెచ్.వెంకటేశ్వరరావు తన నామినేషన్ విరమించుకోవడంతో కరుణాకర్ వడయర్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పెనుమంట్ర మండలంలో తొలి ఏకగ్రీవ గ్రామంగా నత్త రామేశ్వరం నిలిచింది.